ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా ఇష్టపడే బైక్ బుల్లెట్. ఎలాగైన బుల్లెట్ బైక్ ను కొని రయ్యు రయ్యుంటూ రోడ్లలపై దూసుకెళ్లాలని యువత కోరుకుంటుంటారు. అలా ఎంతో వేగంతో దూసుకెళ్లి చివరికి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అచ్చం ఇలాగే బుల్లెట్ బండిపై దూసుకెళ్లిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. విషయం ఏంటంటే? ఓ మారుమూల గ్రామంలో ఓ ముసలవ్వ ఓ దున్నపోతును మేపడానికి రోడ్డుపై మెల్లగా తీసుకెళ్తోంది.
ఈ క్రమంలో దున్నపోతుకు ఎదురుగా ఓ వ్యక్తి బుల్లెట్ బండిపై అతి వేగంతో దూసుకుంటూ వచ్చాడు. ఇక ఎదురుగా వస్తున్న బుల్లెట్ బండి శబ్దాన్ని విన్న ఆ దున్నపోతు బెదిరిపోయింది. వెంటనే పక్కకు జరిగే ప్రయత్నంలోనే ఆ దున్నపోతు బుల్లెట్ బండిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్ బండిని నడుపుతున్న ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరి నేలపై పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని లేపే ప్రయత్నం చేశారు. ఈ ఘటన దృశ్యాలు స్థానిక సీసీ కమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో అదే వీడియోను సోషల్ మీడియాలోఅప్ లోడ్ చేయడంతో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.