యువతి, యువకుడు పెళ్లికి సిద్ధమయ్యారు. తాళికట్టే సమయానికి సినిమా స్టైల్ లో పోలీసులు మండపానికి చేరుకుని వధువును లాక్కెళ్లారు. అసలేం జరిగిందంటే?
కాసేపట్లో పెళ్లి. తాళి కట్టడానికి వరుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే సినిమా స్టైల్ లో పోలీసులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. వీరిని చూసి బంధువులు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. పోలీసులు నేరుగా వచ్చి వధువును లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. వరుడు కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు మాత్రం వెనక్కి తగ్గలేదు. మొత్తానికి వధువును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇంతకు ఆ వధువును పెళ్లి పీటల మీద నుంచి పోలీసులు ఎందుకు లాక్కెళ్లారు. ఆమె చేసిన నేరమేంటి? అసలేం జరిగిందంటే?
బంధువుల కథనం ప్రకారం.. కేరళలోని కోవలం ప్రాంతానికి చెందిన అల్ఫియా, అఖిల్ అనే యువతి యువకుడు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని ఇరువురి తల్లిదండ్రులకు వివరించారు. కానీ, ఇద్దరి మతాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. అయినా సరే ఈ ప్రేమికులు అస్సలు వెనక్కి తగ్గలేదు. ఎలాగైన పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల యువతి, యువకుడు ఓ గుడిలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో తాళికట్టే సమయానికి పెళ్లి మండపానికి పోలీసులు చేరుకున్నారు. వస్తు వస్తూనే వధువును పెళ్లి పీటల మీద నుంచి లాక్కెళ్లారు. వరుడు కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా పోలీసులు ఆ వధువుని స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత పోలీసులు ఆ వధువును కోర్టులో హాజరుపరిచారు. యువతి, యువకుడు మేజర్లు కావడంతో వీరికి పెళ్లి చేసుకోవచ్చని కోర్టు తీర్పును ఇచ్చింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
— krishna veni (@krishna66577649) June 20, 2023