అతనికి ఆమె అంటే ఎంతో ప్రాణం. ఏదేమైనా ఆమెను మాత్రం ప్రేమగా చూసుకుంటాడు. అసలు ఆమె అంటే మనిషి కాదు.. ఓ శవం. అసలేంటి కథా అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఓ యువకుడు ఓ శవాన్ని తన బ్యాగులో పెట్టుకుని తిరుగుతున్నాడు. వినటానికి భయంకరంగా ఉన్న ఇది ముమ్మాటికి నిజం. చచ్చిన శవాన్ని బ్యాగులో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడు. ఈ స్టోరీలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే మీరు తప్పకుండా ఇది చదవాల్సిందే. పెరులో జూలియో సీజర్ బెర్మెజో అనే యువకుడు పూనో ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతని కుటుంబ సభ్యులు కూడా గత కొన్నేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు.
అయితే జూలియో తండ్రి గత 30 ఏళ్ల కిందట జువానిటా అనే మమ్మీని తెచ్చుకుని జాగ్రత్తగా చూసుకున్నాడు. అలా కొన్నేళ్ల అతని కుటుంబ సభ్యులు అందరూ ఆ మమ్మీని చూసుకున్నారు. ఇదిలా ఉంటే గతంలో జూలియో సీజర్ తండ్రి మరణించాడు. అతడు మరణించే ముందు… మమ్మీని అందరూ జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. ఇక అతని మాట ప్రకారమే ఇంట్లో కుటుంబ సభ్యులు అంతా ఆ మమ్మీని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.
మరీ ముఖ్యంగా జూలియో సీజర్ మాత్రం ఆ మమ్మీని అందరికంటే బాగా చూసుకునేవాడు. అయితే ఇటీవల జూలియో సీజర్ ఆ మమ్మీని తన వెంటపెట్టుకుని బయటకి వచ్చాడు. ఎందుకో అనుమానం వచ్చిన పోలీసులు అతడి వద్ద ఉన్న ఐసోథర్మల్ బ్యాగును పరిశీలించారు. అందులో ఓ మమ్మీ కనిపించింది. ఆ సీన్ చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ తర్వాత ఏంటని జూలియో సీజర్ ప్రశ్నించగా.. ఇది నా ప్రియురాలు. చాలా రోజుల నుంచి నేను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను.
మా నాన్న జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడని వివరించాడు. అయితే జూలియో సీజర్ అన్ని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు నమ్మకం కుదరలేదు. దీంతో జూలియో సీజర్ మమ్మీలను అమ్ముకునే వ్యక్తి అతనిపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జూలియో సీజర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ, కొందరు శాస్త్రవేత్తలు జూలియో సీజర్ వద్ద ఉన్న మమ్మీని పరిశీలించగా.. అది 800 ఏళ్ల నాటిదని తేల్చారు. మహిళ మమ్మీ కాదని, పురుషుడిదేనంటూ తెలిపారు.