చిత్ర పరిశ్రమలో నటీ, నటులుగా గుర్తింపు పొందిన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు కానీ వారి పెరిగి పెద్దవారైన నివాసాలు చూడాలని, వారి గురించి తెలుసుకోవాలని చాలా మంది అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక అభిమానుల కోరిక మేరకు సెలబ్రిటీస్ వారి చిన్నప్పటి ఫొటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక వారు షేర్ చేసిన ఫొటోలు తక్కువ సమయంలోనే కాస్త వైరల్ గా మారుతున్నాయి. అయితే తాజాగా తెలుగు చిత్ర సీమలో పెద్ద సెలబ్రిటిగా పేరు తెచ్చుకున్న ఓ వ్యక్తి సైతం ఇలాంటి చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఇదే ఫొటో ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. రెండు జడలు వేసుకుని నవ్వుతూ పలకరిస్తున్న ఈ బుడ్డది ఎవరా అని కనిపిట్టేందుకు ఫ్యాన్స్ మెదడుకు పని చెబుతున్నారు. అయినా ఆమె ఎవరనేది మాత్రం కనిపెట్టడం కాస్త ఆలస్యమవుతోంది. అసలు ఇంతకి ఆమె ఎవరనేది కదా మీ ప్రశ్న. ఆమె ఎవరో కాదు.. తెలుగు చిత్రసీమలో నటిగానే కాకుండా బుల్లితెరపై మాస్ యాంకర్ గా దూసుకెళ్తున్న సుమ. తన వాగ్ధాటితో తీరిక లేకుండా సినిమాలు, ప్రీ రిలీజ్, ఇంటర్వ్యూలు, టీవీ షోలు చేస్తూ తెగ బిజీగా గడుపుతోంది.
తన మాట తీరుతో ఎదుట ఉన్న వ్యక్తి ఎవరైన కానివ్వండి.. తన మాటల ప్రవాహంతో రఫ్పాడిస్తుంటుంది. తెలుగు చిత్రసీమలో సుమ డేట్స్ కోసం చిన్న సినిమాల నుంచి అటు పెద్ద సినిమాల వరకు అందరూ వెయిట్ చేస్తుంటారు. సుమ యాంకరింగ్ తో ఈవెంట్ చేస్తే అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని అందరి నమ్మకం. ఈ నమ్మకంతోనే అందరూ సుమ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇకపోతే సుమ ఇటీవల తను ప్రధాన పాత్ర పోషించి నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. ఇక ఈ సినిమా ఫలితం పరవాలేదనిపించినా.. సుమ నటనలోనూ ఏం తక్కువ కాదని నిరుపించింది. అయితే తాజాగా సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినతన చిన్నపాటి ఫొటో మాత్రం కాస్త వైరల్ గా మారుతోంది.