‘ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరం’ అని ఆర్టీసీ అధికారులు ఎంత చెప్పిన కొందరు పెడచెవిన పెడుతున్నారు. ఇలా ఫుడ్ బోర్డింగ్ ప్రయాణం చేస్తూ బస్సు ఎక్కి దిగే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంతే కాక ఫుడ్ బోర్డింగ్ చేస్తూ వారు ప్రమాదాల్లో పడుతు.. తోటి ప్రయాణికులను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటి ప్రయాణాల వల్ల కొందరు యువత ప్రాణాలు కోల్పోతుంటే .. మరికొందరు కాళ్లు చేతులు కోల్పోయి.. జీవితాంతం వికలాంగులు బ్రతికేస్తున్నారు. తాజాగా బస్సులో ఫుట్ బోర్డింగ్ చేస్తున్న ఓ విద్యార్ధి పట్టు తప్పి బస్సు చక్రాలకు ఆనుకుని పడి పోయాడు. దీంతో అందరు ఒకసారిగా షాక్ కి గురయ్యారు. మరి.. ఆ విద్యార్ధికి ఏమైందో ఈ వీడియోలో చూడండి. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. కాలు పెట్టుకునేందుకు కూడా స్థలం లేదు. అయితే కొంత మంది విద్యార్ధులు ఫుట్ బోర్డు పై ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఫుట్ బోర్డింగ్ చేస్తున్న విద్యార్ధులో ఒకరు పట్టు తప్పి కింద పడిపోతాడు. ఆ సమయంలో ఆ బస్సు వెనక వైపు ఎటుంటి వాహనాలు రాకపోవడంతో ఆ విద్యార్ధికి ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్డు పై పడిపోయిన ఆ విద్యార్ధి లేచి బట్టలకు అంటుకున్న మట్టిని తుడుచుకుని అక్కడి నుంచి వెళ్లి పోయాడు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇలా విద్యార్ధులు ఫుడ్ బోర్డు ప్రయాణలు చేస్తూ ప్రాణాలు కోల్పోయి వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారని కొందరు కామెంట్స్ చేశారు. అయితే తగినని బస్సుల లేక ఈ విద్యార్థులందరూ తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు”అని మరి కొందరు కామెంట్స్ చేశారు. మరి.. ఈవీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Nothings changed except politicians’ bureaucrats’ wealth pic.twitter.com/tm1sOoKrQs
— Indians Amplifying Suffering(IAS) (@ravithinkz) August 30, 2022