విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కీచకుల్లా మారుతున్నారు. తమ బిడ్డలాంటి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ కాలేజ్ ప్రిన్సిపల్ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను ఆ పని కోసం ఇంటికి రమ్మని పిలిచాడు. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నై, నందనమ్‌లో వైఎమ్‌సీఏ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్‌లో వందల మంది విద్యార్థినీ, విద్యార్థులు ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతున్నారు. జార్జ్ అబ్రహం అనే వ్యక్తి కాలేజ్‌లో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నాడు. ఇతడి కన్ను అదే కాలేజ్‌లో పీజీ చదువుతున్న 22 ఏళ్ల యువతిపై పడింది.
ఆమె నెంబర్ తీసుకున్న జార్జ్ తరచుగా ఫోన్ చేసేవాడు. వాట్సాప్‌లో మెసేజ్‌లు కూడా పెట్టేవాడు. ప్రస్తుతం యువతికి, జార్జ్‌కు మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఆడియోలో.. ‘‘ కాలేజ్‌లో ఉన్న వారంతా నాకు ఇష్టమైన స్టూడెంట్సే.. కానీ, నువ్వు మాత్రం వారి కంటే ప్రత్యేకం. నీతో మాట్లాడలని, గడపలని ఉంటుంది. ఓ సారి ఇంటికి వస్తే కలుద్దాం. నువ్వు రాకపోయినా ఏమీ అనుకోను. తప్పుగా అనుకోను’’ అని అన్నాడు. ఆ యువతికి ప్రిన్సిపల్ ఉద్దేశ్యం అర్థం అయింది. ‘మీరు నన్ను ఆ పని కోసం ఇంటికి పిలుస్తున్నారని నాకు అర్థం అయింది’’ అని అంది.
అందుకు ఆ ప్రిన్సిపల్ ‘‘ అవును. నాకు నీతో గడపాలని ఉంది. ఎందుకో తెలీదు. నేను కూడా ఓ మనిషినే కదా.. ఓ కాలేజ్ ప్రిన్సిపల్‌ను అయినా కూడా నేను కూడా ఓ మనిషినే కదా.. నిన్ను మొదటి సారి చూసినపుడు ప్రత్యేకంగా అనిపించావు’’ అని చెప్పుకొచ్చాడు. ఈ ఆడియో రికార్డింగ్స్ బయటకు రావటంతో కాలేజ్‌లోని స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 150 మంది కాలేజ్ ముందు నిరసన చేపట్టారు. అయితే, యువతితో తప్పుగా ప్రవర్తించిన ప్రిన్సిపల్‌పై ఎలాంటి కేసు నమోదు కాలేదు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.