గత కొంత కాలంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. రోడ్డుపై కనిపించిన ప్రతీ వ్యక్తిపై దాడులు చేస్తున్నాయి. అయితే తాజాగా ఇద్దరు మహిళలు స్కూటీపై వెళ్తుండగా వీరిని వీధి కుక్కలు తరుముకొచ్చి దాడి చేయబోయాయి. ఇక ఆ కక్కుల దాడి నుంచి తప్పించుకోయి ఆ మహిళలు స్కూటీపై నుంచి కిందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత కొన్ని రోజుల నుంచి వీధి కుక్కలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వాళ్ల వరకూ ఎవరినీ వదలకుండా వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా తెలంగాణలో ఓ అడిషనల్ కలెక్టర్ పై సైతం వీధి కుక్కలు దాడి చేశాయి. అయితే ఈ ఘటనలు మరువకముందే ఇద్దరు మహిళలు స్కూటీపై వెళ్తుండగా వారిని వీధి కుక్కలు తరుముకొచ్చి దాడి చేయబోయాయి. భయంతో తప్పించుకోయి స్కూటీపై వెళ్తూ వారు కిందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
ఒడిశాలోని బెర్హంపూర్ లో ఇద్దరు మహిళలు ఓ బాలుడితో పాటు స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వీధిలో ఉన్న కొన్ని కుక్కలు వీరిని చూసి తరుముకుంటూ వచ్చాయి. ఆ కుక్కలను చూసిన ఆ మహిళ స్కూటీ వేగాన్ని మరింత పెంచింది. ఇక ఎదురుగా ఓ కారు ఆగి ఉన్నది చూడని ఆ మహిళ.. స్కూటీతో వేగంగా ఆ కారును ఢీ కొట్టింది. దీంతో వారు క్షణాల్లో ఎగిరి కిందపడ్డారు. వెంటనే కుక్కలు భయంతో వెనకడుగు వేసి అక్కడి నుంచి పరారయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం. ఈ ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి కిందపడ్డ మహిళల ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) April 4, 2023