ఈ మధ్యకాలంలో సినిమా పాటలన్నీ సోషల్ మీడియాలో ద్వారానే ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. సాంగ్ రిలీజైన సమయం నుండి మిలియన్ల వ్యూస్ తో రికార్డులు నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప సాంగ్స్ హవా మాములుగా లేదు. ఇప్పటికే అభిమానుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు పుష్పలోని ‘సామీ సామీ’ పాట పై డాన్స్ వీడియోలు, రీల్స్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా సామీ సామీ పాటకు సంబంధించి ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పుష్పలో రారా సామీ అంటూ రష్మిక మందన ఓ రేంజిలో అందాల విందు అందించింది. తాజాగా అదే పాట పై స్పైడర్ మ్యాన్ డాన్స్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇటీవల క్రిస్మస్ వేడుకల్లో భాగంగా స్పైడర్ మ్యాన్ గెటప్ వేసిన ఓ వ్యక్తి సామీ పాట పై డాన్స్ కుమ్మేశాడు. అతనితో పాటు సెలబ్రేషన్స్ లో పాల్గొన్నవారు కూడా జోష్ తో ఆడిపాడారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.