చంద్రగ్రహణం వేళ అద్భుతం చోటు చేసుకుంది. ఒక నాగుపాము నడిరోడ్డు మీద అరగంట సేపు అలానే కదలకుండా ఉంది. ప్రకాశం జిల్లా దోర్నాల-మార్కాపురం ప్రధాన రహదారిలో నడిరోడ్డు మీద నాగుపాము కాసేపు హల్చల్ చేసింది. పడగా మీద అరగంట సేపు అలానే ఉంది. ఎవరైనా అటువైపు వెళ్తుంటే బుసలు కొట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో జనం భయపడి ఆగిపోయారు. ఈ కారణంగా రోడ్డు మీద వాహనాలు 30 నిమిషాల పాటు నిలిచిపోయాయి. అయితే ఇవాళ (నవంబర్ 8న) చంద్రగ్రహణం కారణంగా కొంతమంది పట్టువిడుపు పాటిస్తారు. ఈ క్రమంలోనే నాగు పాము కూడా గ్రహణాన్ని పాటించిందని కొంతమంది వాదిస్తున్నారు.
గ్రహణం మొదలైనప్పటి నుంచి గ్రహణం ముగిసేవరకూ పాము అలానే రోడ్డుపై ఉండి.. గ్రహణం విడిచిన తర్వాత పాము అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో పాము గ్రహణాన్ని పాటించిందని జనం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే రోజున కార్తీక పౌర్ణమి కావడంతో మరో వాదన కూడా వినబడుతోంది. పున్నమి వేళ పాములకు కళ్ళు కనబడవని.. కళ్ళు కనబడకే రోడ్డుపైకి వచ్చి ఉంటుందని, అయితే వాహనాల శబ్దాల కారణంగా భయపడి రోడ్డు పైనే ఉండిపోయిందని మరికొంతమంది వాదిస్తున్నారు. మరి పాము ఎందుకు అలా ఉందో అనేది మాత్రం అంతుపట్టడం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గమనిక: సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని కథనాల ఆధారంగా ఈ వార్త ఇవ్వడం జరిగింది. ఇందులో నిజం ఎంత అన్నది సుమన్ టీవీ ఎక్కడా నిర్ధారించడం లేదు.