సాధారణంగా సినిమా హీరోయిన్స్ కంటే స్పోర్ట్స్ లో పాపులర్ అయిన అమ్మాయిలే ఎక్కువ అందంగా ఉంటారు. సినిమా హీరోయిన్లలో కొంతమంది నేచురల్ అందంతో ఉన్నప్పటికీ, దాదాపు అందరూ మేకప్స్ వేసే అందంగా కనిపిస్తుంటారు. కానీ.. బయట స్పోర్ట్స్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న అమ్మాయిలు హీరోయిన్లను మించిన అందంతో మురిపిస్తుంటారు. దేశంలో ఎంతోమంది అందమైన హీరోయిన్స్ ఉన్నా.. దేశవ్యాప్తంగా ఉన్న యూత్ మనసుని తమవైపు తిప్పుకునే అందగత్తెలు అరుదుగా ఉంటారు. అలా కొన్నేళ్లుగా నేషనల్ క్రష్ గా అందరి మనసులు దోచుకున్న బ్యూటీ స్మృతి మందాన.
సినిమాల పరంగా మూవీ లవర్స్ కి నేషనల్ క్రష్ రష్మిక మందాన ఉందేమో.. కానీ, సినిమాలకు సంబంధం లేకపోయినా.. క్రికెటర్ గానే దేశం మొత్తాన్ని ఫిదా చేసింది స్మృతి. ఈ బ్యూటీ గురించి అటు సినీ ప్రేక్షకులకు, స్పోర్ట్స్ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో స్మృతి క్రేజ్ పీక్స్ లో ఉంటుందనే చెప్పాలి. ఎప్పుడూ మైదానంలో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడే స్మృతి.. అప్పుడప్పుడు కుర్రాళ్ళ గుండెలతో కూడా ఆటాడిస్తూ ఉంటుంది. కేవలం స్మృతి నవ్వుతున్న పిక్ కనిపిస్తేనే పొంగిపోయే అభిమానులు కోట్లలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఇక స్మృతి మంచి బ్యాటర్ మాత్రమే కాదు.. మంచి ఎంటర్టైనర్ కూడా. అందుకే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు తన ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. ఫెస్టివల్స్ అయినా.. స్పెషల్ కాస్ట్యూమ్స్ ధరించినా స్మృతి ఫ్యాన్స్ కి పండగే. తాజాగా ట్రెడిషనల్ లుక్కులో కొత్త ఫోటోలు పోస్ట్ చేసింది. అంతే.. ఫ్యాన్స్ ఊరుకుంటారా! స్మృతిపై ఉన్న ప్రేమాభిమానాలు అన్నీ లైక్స్ రూపంలో తెలియజేస్తున్నారు. పింక్ కలర్ లెహంగాలో.. నవ్వుతూ చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి విందుచేస్తోంది. మరి నేషనల్ క్రష్ స్మృతి కొత్త లుక్ మీరు కూడా చూసేయండి.