తెలుగు సినీ పరిశ్రమలో యువ నటులు ఒక్కొక్కరుగా అనారోగ్యం బారిన పడుతున్నారు . మొన్నటికి మొన్న సమంత మయోసైటిక్ బారిన పడి కోలుకోగా. . అనుష్క, రేణు దేశాయ్ లు కూడా తాము వింతైన వ్యాధుల బారిన పడ్డట్లు వెల్లడించారు. తాజాగా మరో నటుడు గాయపడినట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమా పరిశ్రమకు దిష్టి తగిలనట్టుంది. ఒక్కసారిగా సీనియర్ నటులంతా ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతుంటే.. యంగ్ తరం నటీనటులంతా ఊహించని, వింతైన రోగాల బారిన పడుతున్నారు. కృష్ణంరాజుతో మొదలు, గాయని వాణి జయరాం మరణం వార్తలు వరకు ఇండస్ట్రీని కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అటు సమంత నుండి అనుష్క వరకు వింత వ్యాధుల బారిన పడినవారే. దీంతో అభిమానులు సైతం బాధను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో నటుడు కూడా గాయపడినట్లు తెలుస్తుంది. సింగర్ గీతా మాధురి భర్త, నటుడు నందుకి గాయపడిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఫోటో అనే సినిమాతో ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి అడుగుపెట్టిన నందు తొలి నాళ్లలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించారు. 100 పర్సంట్ లవ్, ఆటోనగర్ సూర్య లో పలు పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. పాఠశాలలో ఓ హీరోగా నటించారు. హీరోగా నిలదొక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నంది అవార్డు సినిమా పెళ్లి చూపులు వంటి పలు సినిమాల్లో నెగిటివ్ పాత్రలో మెప్పించారు. సవారీ మూవీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాను తన భుజాన కెత్తుకుని ప్రమోషన్ చేసినా సినిమా విఫలమైంది. అయితే ఇప్పుడు ఈ కుర్రాడు పూర్తిగా లుక్ మార్చేశాడు. అలా అని హీరో అనే ట్యాగ్ కి వేలాడుకుండా.. వచ్చిన పాత్రను చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇటీవల నందు గాయపడినట్లు తెలుస్తోంది. ఆయనే ఈ విషయాన్ని తెలిసేలా ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో కాలికి గాయమైనట్లు కనబడుతోంది.
తన కాలికి గాయమైనా, నడవలేని స్థితిలో ఉన్నా కూడా డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోకి వచ్చాడు. ఆ స్టూడియోలో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నాడు. ఈ ఫోటోతోనే నందుకి యాక్సిడెంట్ అయినట్టుగా, కాలికి పట్టి కట్టినట్టు అర్థం అవుతోంది. అయితే ఇది ఎలా జరిగిందనే విషయం మాత్రం చెప్పలేదు. ఇన్ స్టా ను తనిఖీ చేస్తే ఎప్పుడో గాయపడినట్లు తెలుస్తుంది. నందు ప్రస్తుతం సినిమాలు, క్రికెట్ కామెంటరీలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అంతేకాకుండా విపరీతమైన వర్కౌట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన గాయపడి ఉంటారని సమాచారం. నందు ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 28 తో పాటు ఆర్‌సి 15,డిజే టిల్లు 2, హరిహరమల్లు, ధాస్ కీ ధమ్కీ సినిమాలతో నటిస్తున్నారని తెలుస్తుంది. నందు నచ్చిన సినిమాల్లో మీకు ఏ క్యారెక్టర్ ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.