పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు అర్పణ. మోతీనగర్ పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఈ మహిళ గర్భవతి అయింది. అత్తింటి వారు కోడలికి సీమంతం చేయడానికి వీలు కుదరకపోవడంతో తోటి ఉద్యోగులు అంతా కలిసి ఆమెకు స్టేషన్ లోనే ఘనంగా సీమంతం జరిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఆమె పేరు అర్ఫణ. ప్రస్తుతం మోతీ నగర్ లో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఈమెకు ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కాలం నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ ఉంది. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది. దీంతో అత్తింటివారు అర్ఫణకు సీమంతం చేయాలని అనుకున్నారు. కానీ, ఉద్యోగ నిమిత్తంలో భాగంగా సెలవులు కుదరకపోవడంతో సీమంతం క్యాన్సిల్ అయింది. అయితే ఇదే విషయం స్టేషన్ ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్లడంతో ఏకంగా స్టేషన్ లోనే ఆమెకు సీమంతం జరిపించారు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు!
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా మోతీనగర్ ప్రాంతం. ఇక్కడే ప్రఖర్ శర్మ-అర్పణ దంపతులు నివాసం ఉంటున్నారు. గతంలో వీరికి వివాహం జరిగింది. అయితే అర్పణ మోతీనగర్ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే అర్పణ గత ఆరు, ఏడు నెలల కిందట గర్భవతి అయింది. దీంతో ఆమె అత్తింటి వారు ఆ మహిళకు సీమంతం చేయాలని అనుకున్నారు. కానీ, ఆమె ఉద్యోగం నిమిత్తంలో భాగంగా బిజీగా ఉండడంతో సీమంతం చేయడం కుదరలేదు.
ఇదే విషయం మోతీనగర్ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అర్పణకు తెలియకుండా సర్ ప్రైజ్ ఇవ్వాలని భావించి ఏకంగా ఆమెకు పోలీస్ స్టేషన్ లోనే సీమంతం చేయాలని అనుకున్నారు. ఇందు కోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసి అర్పణకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ వేడుకకు పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఆమె సహోద్యోగులు అందరూ పాల్గొన్నారు. ఇంత ఘనంగా ఆమెకు సీమంతం చేయడంతో అర్పణ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది.
తోటి ఉద్యోగులు, పోలీస్ ఉన్నతాధికారులు చూపించిన ప్రేమను మరువలేనంటూ ఆ మహిళ కాస్త ఏమోషనల్ అయింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు తీసుకున్న కొందరు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తోటి మహిళా కానిస్టేబుల్ కు స్టేషన్ లోనే సీమంతం చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.