దొంగ వెధవలు కదండీ.. కాళ్ళూ, చేతులూ బాగున్నా కూడా ఎందుకు కష్టపడాలి అని దిక్కుమాలిన సిద్ధాంతం ఒకటి పెట్టుకుంటారు. కష్టపడాలనుకుంటే 8 గంటలు పని చేయాలి. అదే జేబులు కత్తిరించే పనులు, బైక్ దొంగతనాలు లాంటివైతే 8 గంటలు కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ అలా వెళ్లి ఇలా వచ్చేయచ్చునని అనుకుంటారు. అందుకే బస్టాండుల్లోనూ, రైల్వేస్టేషన్ల లోనూ, రద్దీ ప్రదేశాల్లోనూ తమ హ్యాండ్ వాటం చూపిస్తుంటారు. ఇన్నాళ్లు దొంగలు రాత్రుళ్ళు మాత్రమే దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు జనరేషన్ మారింది. రాత్రుళ్ళు నిద్ర ఎందుకు చెడగొట్టుకోవాలని పట్టపగలే ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. రాత్రుళ్ళు వాళ్లకి కూడా ఫ్యామిలీస్, వైఫ్, కిడ్స్ ఉంటారు కదా. అందుకే మార్నింగ్ షిఫ్ట్ దొంగతనాలకు పాల్పడుతున్నారు.
అయితే తాడిని తన్నేవాడు ఉంటే వాడ్ని తలదన్నే వాడుంటాడు అని అంటుంటారు. దీనికి వీడియో రూపం ఇచ్చేలా ఒక చోట ఒక ఘటన జరిగింది. ఎక్కువ అపార్ట్ మెంట్లు ఉండే చోట సెక్యూరిటీ గార్డ్ లు ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు దొంగలు ఒక కాలనీ లోపలకి వెళ్లారు. సెక్యూరిటీ గార్డ్ కి ఏం చెప్పి వెళ్లారో తెలియదు గానీ మొత్తానికి లోపలికి వెళ్లారు. తెలిసిన వారిని కలవాలనో, ఇంకేదో కారణం చెప్పి వెళ్లి ఉండచ్చు. ఒక బైక్ ని దొంగిలించి అక్కడ నుంచి బయట పడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బైక్ మీద వేగంగా వెళ్తున్నారు. వెనకాలే బైక్ యజమాని కేకలు వేస్తూ.. వాళ్ళని తరుముకుంటూ వెళ్తున్నారు.
అది గమనించిన సెక్యూరిటీ గార్డ్ వెంటనే అలర్ట్ అయ్యి.. గేటు మూసేశాడు. దీంతో వేగంగా వస్తున్న బైక్ గేటుని బలంగా గుద్దడంతో దొంగలిద్దరూ కింద పడ్డారు. ఆ తర్వాత బైక్ యజమాని, అపార్ట్ మెంట్ లోని వ్యక్తులు వచ్చి దొంగలను పోలీసులకు అప్పగించారు. సాధారణంగా దొంగ దొంగ అని అరిస్తే.. సినిమాల్లో కీలు బొమ్మల్లా చూస్తూ ఉండడం తప్పితే.. కళ్ళ ముందు నుంచి వెళ్తున్నా దొంగని పట్టుకునే సాహసం చేయరు కొంతమంది. కానీ ఈ విషయంలో సెక్యూరిటీ గార్డ్ మాత్రం షార్ప్ గా ఆలోచించి దొంగలిద్దరినీ సులువుగా పట్టుకున్నాడు. సెక్యూరిటీ గార్డ్ చేసిన పనికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.