సాధారణంగా గుండె ఎక్కడుంటుంది అని అడిగితే.. ఎడమవైపేగా ఉండేది అని టక్కున సమాధానం చెబుతాం. పైగా ఆ ప్రశ్న అడిగిన వారిపై అసహనమూ ప్రదర్శిస్తాం. కానీ.. మన కథలోని యువతికి గుండె కుడి వైపున ఉంది. ఇది వాస్తవం. పది లక్షల మందిలో ఒకరికి ఈ విధంగా ఉంటుంది. అలాంటి యువతి మనముందుకొచ్చి, తన అనుభవాలను మనతో పంచుకొంది. మరి వీరిలో గుండె పని తీరు ఎలా ఉంటుంది..? అందరిలానే వీరు ప్రవర్తిస్తారా..? వీరి జీవన శైలిలో చోటుచేసుకునే మార్పులేంటి..? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలను సదరు యువతి మనతో పంచుకున్నారు.. ఆ వివరాలు
ఎవరైనా మనతో ‘నాకు గుండె కుడివైపున ఉంటుంది’ అని చెప్పగానే.. మనం వారివైపు అదో రకంగా చూస్తాం.. వీడెంటి గుండె కుడివైపు అంటాడు.. బాగానే ఉన్నావా..! మెంటల్ హాస్పిటల్ నుంచి రాలేదుగా అన్నట్లుగా ప్రశ్నలు సంధిస్తాం.. ఎవరి మనుసులో అయినా కలిగే భావన ఇదే. కానీ, ఇలాంటి మనుషులు ఉన్నారు. వీరిని ‘డెక్స్ట్రో కార్డియాక్’ అంటారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందన్న దానిపై వైద్యులు చెప్పిన
దానిని బట్టి.. ‘బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో బిడ్డ శరీర భాగాలు కూడా కదులుతూ ఉంటాయట. ఆలా అవి ఆయా స్థానాల్లోకి వెళ్లే సమయంలో ఏదైనా తేడా జరిగితే ఈ విధంగా జరుగుతుందట..’
వీరిలో గుండె కుడివైపు ఉండటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. గుండె ఎడమవైపు ఉన్నవారు ఎలా స్పందిస్తారో.. వీరు అలానే స్పందిస్తారు. దీని వల్ల గుండెకు సంబంధించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అందులోనూ.. ఆడవారిలో గుండె కుడివైపు ఉండడం వల్ల వారిని పెళ్లి చేసుకోబోయే వారికి.. పిల్లల పుట్టుకపై ఎన్నో సందేహాలు కలుగుతాయి. అలాంటి వాటిని నివృత్తి చేసేందుకు గుండె కుడివైపు ఉన్న రమ్య మన ముందుకు వచ్చింది. ఇలా ఉండటం వల్ల తన ఆరోగ్యం ఎలా ఉంది.. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. వంటి వివరాలను సుమన్ టీవీతో పంచుకుంది. ఆ విషయాలు ఆమె మాటల్లోనే మీరూ వినండి..