సాధారణంగా బైక్ – స్కూటీ(టు వీలర్)లను డ్రైవ్ చేయాలంటే హ్యాండిల్ పట్టుకొని డ్రైవ్ చేయడం మాత్రమే మనకు తెలిసింది. అలాగే సర్కస్ లలో మాత్రం హ్యాండిల్ పైన నిలబడి విన్యాసాలు చేయడం కూడా చూస్తుంటాం. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే జనాలు ఆశ్చర్యపోయేలా.. అరే ఇలా కూడా టు-వీలర్ డ్రైవ్ చేయొచ్చా! అనుకునేలా చేస్తుంటారు కొందరు.
తాజాగా ఓ కుర్రాడు డ్రైవ్ చేసిన విధానం చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మనం ముందుకు డ్రైవ్ చేయడం తెలుసు. కానీ ఈ కుర్రాడు వెనక్కి డ్రైవ్ చేసాడు. అదీగాక స్కూటీకి వెనక వైపు ఓ హ్యాండిల్ అమర్చి డ్రైవ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.