Monkey: కోతులకు అంత్యక్రియలు జరిపించటం అన్నది ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారు హిందువులు. హనుమాన్‌కు ప్రతీకగా చెప్పుకునే వానరానికి అంత్యక్రియలు చేయటం దేవుడ్ని సేవించుకోవటం లాంటిదేనని భావిస్తారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ సాంప్రదాయం ఆచరణలో ఉంది. తాజాగా, ఓ కోతికి కొంతమంది జనం అంత్యక్రియలు నిర్వహించారు. బ్యాండు బాజాలతో ఓ మనిషికి అంత్యక్రియలు జరిపించినట్లుగా జరిపారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యప్రదేశ్, రెవా జిల్లాలోని ఓ ధియోధర్ పట్టణంలో ఓ కోతి కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. కరెంట్ పోల్ దగ్గరే విగతజీవిగా పడిఉంది.
అక్కడ వ్యాపారం చేసుకునే కొంతమంది వర్తకులు మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వాళ్లు అది తమ పని కాదని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లకు ఫోన్ చేయమని చెప్పారు. దీంతో ఆ వర్తకులు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లకు ఫోన్ చేశారు. అయితే, వాళ్లు కూడా అది తమ పని కాదని మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేయాలని సమాధానం ఇచ్చారు. చనిపోయిన కోతికి అంత్యక్రియలు చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడివారంతా కోతికి సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించాలని నిశ్చయించుకున్నారు.వెంటవెంటనే ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాండు,బాజాలను రంగంలోకి దింపారు. కోతిని ఓ రాముడి బొమ్మ ఉన్న కాషాయం రంగు వస్త్రంలో చుట్టి ఓ వ్కక్తి రెండు చేతుల్తో పట్టుకున్నాడు. అతడి ముందు బ్యాండు, బాజాలు వెళుతున్నాయి. వెనకాల ఓ వ్యక్తి పూలు చల్లుతూ నడుస్తున్నాడు. అతడి వెనకాల మరికొంతమంది జనం ఉన్నారు. ఇలా అందరూ కలిసి ఓ చోటుకి చేరారు. అక్కడ గొయ్యి తీసి కోతిని ఖననం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
In Teother locals held a traditional funeral of a monkey with a band that died due to electrocution, holding the carcass with garlands and wrapped in a cloth with the name of Lord Ram inscribed on it @ndtv @ndtvindia pic.twitter.com/mflq9Duu7i
— Anurag Dwary (@Anurag_Dwary) May 26, 2022
ఇవి కూడా చదవండి : Africa: ఈ గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష వేశారు.. ఎందుకంటే?