Viral Video: గురువంటే విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించటం మాత్రమే కాదు.. వారికి కష్టనష్టాలు వచ్చినపుడు తోడుగా నిలబడే వాడు కూడా అని నిరూపించాడు ఓ ప్రిన్సిపల్. తన కాలేజ్ విద్యార్థులు బస్సు కోసం ఇబ్బంది పడుతున్నారని తెలిసి చలించిపోయాడు. బస్సు వాళ్లతో గొడపడి మరీ బస్సును విద్యార్థుల దగ్గరకు తీసుకెళ్లాడు. ఇందుకోసం చాలా సాహసమే చేశాడు. ఏకంగా బస్సుకు అడ్డంగా నిలబడి గొడవకు దిగాడు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని మలప్పురం జిల్లా, పెరిన్‌తాల్‌మన్నాకు చెందిన డాక్టర్ సకీర్ పీటీఎమ్ హైయర్ సెకండరీ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఆయన ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న స్కూలు విద్యార్థులు బస్సు కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలియవచ్చింది. ఓ రోజు నేరుగా విద్యార్థులతో కలిసి బస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే, బస్సు స్కూలు దగ్గర ఉన్న బస్‌స్టేషన్‌లో కాకుండా చాలా దూరంగా వెళ్లి ఆగుతోందని ఆయన గుర్తించాడు. అంతదూరం విద్యార్థులు నడుచుకుని వెళ్లి బస్సు ఎక్కటానికి ఇబ్బంది పడుతున్నారని అర్థమై చలించిపోయాడు. వెంటనే బస్సు ఆగే స్థలం దగ్గరకు వెళ్లాడు. రోడ్డుపై స్కూలు వైపు వస్తున్న బస్సుకు అడ్డంగా వెళ్లాడు. దాన్ని ముందుకు వెళ్లకుండా ఆపుచేశాడు. అనంతరం డ్రైవర్‌తో ఈ విషయమై గొడవ పెట్టుకున్నాడు.
ఆ తర్వాత కండెక్టర్‌తో కూడా గొడవ పెట్టుకున్నాడు. స్కూలు దగ్గర ఎందుకు బస్సు ఆపటం లేదని నిలదీశాడు. వాళ్ల దగ్గరి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆగ్రహానికి గురై బస్సుకు అడ్డంగా నిలబడ్డాడు. తర్వాత వారితో చాలా సేపు గొడవపడి ఒప్పించాడు. విద్యార్థులు ఉన్న చోటుకు బస్సును తీసుకెళ్లాడు. తమ కోసం బస్సును తీసుకొచ్చిన ప్రిన్సిపల్‌ను విద్యార్థులు చప్పట్లు, కేకలతో అభినందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భర్తను తల్లితో.. చెల్లితో పంచుకుంటున్న మహిళ!