నడి రోడ్డుపై ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ పోలీస్ ఆఫీసర్ ఓ మహిళపై అందరూ చూస్తుండగానే దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగింది
బాధ్యత గల వృత్తిలో ఉండి కొందరు అధికారులు దారుణాలకు పాల్పడుతున్నారు. డ్యూటీలో ఉండగానే మద్యం సేవించడం, అమాయకులపై దాడులు చేయడం వంటివి చేస్తుంటారు. అచ్చం ఇలాగే హద్దులు దాటి ప్రవర్తించిన ఓ పోలీస్ అధికారి మహిళా అని చూడకుండా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?
తూర్పు చైనాలోని సాంగ్ జియాంగ్ జిల్లాలోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ మహిళ రోడ్డుపై తన బిడ్డను ఎత్తుకుని ఓ పోలీస్ ఆఫీసర్ తో వాగ్వాదానికి దిగింది. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన ఆ పోలీస్ ఆఫీసర్.. ఆ మహిళపై దాడి చేసి కిందపడేశాడు. అంతేకాకుండా కిందపడ్డ వదలకుండా ఆమెపై పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కొందరు స్థానికులు వెంటనే ఆ మహిళను రక్షించారు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అయితే 2017లో జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
— Hardin (@hardintessa143) April 10, 2023