పెట్రోల్ రేట్లు భరించలేక మన బాధల్లో మనముంటే.. బంకు యజమానులు మాత్రం వారి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటున్నారు. ఇప్పటివరకు మనం చూసిన పెట్రోల్ బంకు మోసాలు ఒక లెక్క..ఇది మరో లెక్క. పెట్రోల్ కొట్టమని ఒక 200 రూపాయలు అక్కడున్న సిబ్బంది చేతిలో పెట్టాం.. అతను మెషిన్ లో 200 ఎంటర్ చేశాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి..? పెట్రోల్ పోయాల్సిన పిస్టన్ తీసి మన వాహనంలో పెట్టి.. పిస్టన్ స్టార్ట్ చేస్తే.. పెట్రోల్ మన వాహనంలో పడుతూ.. మీటర్ రీడింగ్ తిరగలి అంతేకదండి.
అయితే.. ఈ పెట్రోల్ బ్యాంకు యజమాని నేను అందరిలాంటి వాడిని కాదు నిరూపించాడు. “అమౌంట్ ఎంటర్ చేశాక.. పిస్టన్ మీ వాహనంలో పెట్టాల్సిన అవసరం లేదు.. మా సిబ్బంది పట్టుకొని ఉంటారు.. ఆటోమాటిక్ గా మీటర్ రీడింగ్ తిరుగుద్ది.. మీరు చూస్తూ ఉండండి చాలు” అని చూపించాడు. డౌట్ వచ్చిన ఓ వ్యక్తి.. ఈ మోసాన్ని వీడియో తీశాడు. అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించగా.. వారు మెల్లగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.