తమ భర్తలను వెంటనే విడుదల చేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున, ఆందోళనలు ధర్నాలు చేస్తామంటూ కొందరు భార్యలు రోడ్డెక్కారు. భర్తల కోసం భార్యలు రోడ్డెక్కడం ఏంటి? ఎందుకు ఆ మహిళల భర్తలను అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే తప్పకుండా మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. అసోంలో బాల్య వివాహాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వ కఠిన చర్యలకు సిద్దమవుతోంది. అయితే ఇందులో భాగంగానే మైనర్ బాలికలను వివాహాలు చేసుకున్న ఏకంగా 2,258 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇందుకు నిరసనగా ధుబ్రా జిల్లాలోని ఓ ప్రాంతంలో తమ భర్తల అరెస్ట్ కు నిరసన భార్యలు ఏకంగా రోడ్ల మీదకు వచ్చారు. ఇంతటితో ఆగకుండ వెంటనే తమ భర్తలను విడుదల చేయాలని, లేకుంటే ఆందోళనలు తీవ్ర తరం చేస్తామంటూ హెచ్చరించారు. ఇక దీంతో అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆ మహిళలను చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక్కసారిగా అల్లర్లు జరగడంతో పోలీసులు ఆ మహిళలపై లాఠీచార్జీ చేశారు. ఇదే ఘటన అక్కడ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. భర్తల కోసం రోడ్డెక్కిన ఈ భార్యల నిరసనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.