సాధారణంగా హోలీ పండుగ వచ్చిందంటే చాలు.. రంగులు, గుడ్లు, టమాటాలు కొట్టుకోవడం చూస్తుంటాం.. సరే ఇంకాస్త లోకల్ గా ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో బురద నీళ్లు, పేడ నీళ్లు, కుళ్లిపోయిన పండ్లతో హోలీ సెలబ్రేట్ చేయడం గురించి వింటూనే ఉన్నాం. కానీ ఇండియాలోని ఒక ఏరియాలో హోలీ రోజు పై చెప్పినవన్నీ కాకుండా.. ఇంకా వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇంతకీ ఆ వెరైటీ ఏంటా అని ఆలోచిస్తున్నారా? అక్కడి వాళ్లంతా రంగులను చల్లడానికి బదులుగా.. రంగులు కలిపిన నీటిలో దిగి.. కాలికి తొడిగిన చెప్పులు తీసి ఒకరిపై ఒకరు విసురుకున్నారు. అయితే.. దేశంలో ఒక్కో చోట ఒక్కోలా హోలీ జరుపుకుంటున్నారు. కానీ చెప్పులు విసురుకున్న ఘటన మాత్రం బీహార్ రాజధాని పాట్నాలోని ఓ వాటర్ పార్క్ లో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. ప్రస్తుతం చెప్పులు విసురుకుంటూ హోలీ సెలెబ్రేట్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వెరైటీ హోలీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#WATCH पटना : वाटर पार्क में होली के जश्न के दौरान लोग एक-दूसरे पर चप्पल फेंकते दिखे। pic.twitter.com/eFAY65wsU7
— ANI_HindiNews (@AHindinews) March 17, 2022