వివాహ బంధంతో పుట్టినింటిని వదిలి మెట్టినింట్లో అడుగుపెట్టపోయే భార్యకు భర్త ఆపురుపమైన కానుకలు ఇవ్వడం సాధారణం. వధూవరులు ఇద్దరూ వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వీటిలో ఎక్కువగా నగలు, ఖరీదైన వస్తువులు ఉంటాయి. కానీ, పాకిస్తాన్ కు చెందిన ఓ యువకుడు మాత్రం తన కాబోయే భార్యకు ‘గాడిద పిల్ల’ను గిప్టుగా ఇచ్చాడు. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి కాబోయే భార్య షాక్ అవ్వలేదు కానీ.. పెళ్లికొచ్చిన అతిధులందరూ పగలబడికున్నారు. అయితే.. అతడు ‘గాడిద పిల్ల’ను గిప్టుగా ఇవ్వడం వెనుక ఒక బలమైన కారణముంది.
పాకిస్తాన్ కు చెందిన యూట్యూబర్ అజ్లాన్ షా, జంతు ప్రేమికురాలైన వారిశా వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు. ఈ క్రమంలో అజ్లాన్.. కాబోయే భార్యకు జీవితాంతం గుర్తుండిపోయే ఓ వెరైటీ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాడు. వెంటనే పెళ్లి మండపంలోనే అందరూ చూస్తుండగా.. ఓ గాడిద పిల్లను తీసుకువచ్చి భార్యకు గిఫ్ట్ గా ఇచ్చాడు. అది చూసి ఆమె చాలా సంతోషపడింది. అతడు ‘గాడిద పిల్ల’ను గిప్టుగా ఇవ్వడానికి కారణం..వరిషా జంతు ప్రేమికురాలు కావడమే. కుక్కనో.. పిల్లినో.. ఇస్తే అపురూపంగా మురిసిపోతుంది కానీ, జీవితాంతం గుర్తుంచుకోదని.. ఈ వెరైటీ గిఫ్ట్ కానుకగా ఇచ్చాడట.
ఈ విషయంపై స్పందించిన వరుడు అజ్లాన్.. ‘గాడిద పిల్లలంటే వారిశాకు చాలా ఇష్టమనే సంగతి నాకు ఎప్పటినుంచో తెలుసు. అందుకే నా తరఫున వివాహ కానుక ఇదే. ఒకవేళ బహుమతిగా ఈ గాడిదను ఎందుకు ఎంచుకున్నావు అని నా భార్య అడిగితే, ఒకటేమో అదంటే నీకు ఇష్టం, రెండోది గాడిద అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టపడే, అత్యంత ప్రేమగా ఉండే జంతువు అని చెబుతా..’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ఇంకో మాట.. ‘దయచేసి దీన్ని ఎవరు ఎగతాళి చేయకండి. నేను ఈ గాడిద పిల్లను దాని తల్లి నుంచి వేరు చేయలేదు. తల్లి కూడా ఈ పిల్ల గాడిదతోనే ఉంది..’ అని తెలిపాడు. ఈ మాటలు విన్న వధువు వారిశా .. ‘నేను, దీన్ని కేవలం గాడిదలా చూడటం లేదు.. ‘ అని చెప్పుకొచ్చింది. ఈ వెరైటీ గిఫ్ట్ పై మీ అభిప్రాయాన్ని తెలపడమే కాకుండా.. మీరైతే ఎలాంటి గిఫ్ట్ ఇస్తే ఇస్తారో.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.