సాధారణంగా గంగానదిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. గంగానదిలో మూడు మునకలు వేస్తే చేసిన పాపాలు పోతాయని నమ్ముతుంటారు. గంగానదిలో నిత్యం పుణ్యస్నానాలు ఆచరిస్తుండటం వల్ల భక్తుల తాకిడి అధికంగానే ఉంటుంది. అయితే ఉత్తరాఖండ్.. హరిద్వార్ లో ఓ అనుహ్యామైన ఘటన జరిగింది. అది చూసిన అక్కడి జనం మొత్తం నోరెళ్లబెట్టారు. అదేంటంటే.. ఓ 70 ఏళ్ల బామ్మ వంతెన పైనుంచి నదిలోకి దూకి సాహసం చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా హర్ కీ పౌరీ బ్రిడ్జి ఎక్కేసి దూకేందుకు చూస్తోంది.
అక్కడ ఆమె పక్కనే ఉన్న ఓ వ్యక్తి బామ్మను ఆపి.. అది ప్రమాదకరం అని చెప్పాల్సిందిపోయి ఇదిగో అక్కడ దూకండి అంటూ ఓ ప్రదేశం చూపించాడు. ఇంకే ముంది కాసేపు ఆగితే మళ్లీ జనం ఆపేస్తారు అనుకుందో ఏమో. బామ్మ హడావుడిగా ఇనుమ గేటు మధ్యలోంచి దూరి ఒక్కసారిగా వంతెన పైనుంచి దూకేసింది. ఆ గంగా ప్రవాహంలో సరదాగా ఈదూకుంటూ ఒడ్డుకు చేరుకుంది. ఆ మొత్తం ఘటనను అక్కడున్న మరో వ్యక్తి తన కెమెరాలో బందించాడు.
अम्मा की छलांग .. 😳😳
हरकी पैड़ी के पुल से गंगा नदी में छलांग लगाने वाली बुजुर्ग महिला बुजर्ग महिला पुल से गंगा में छलांग लगाकर आराम से तैरकर किनारे जाती हुई विडियो में दिख रही है। बुजुर्ग महिला की उम्र 70 साल के करीब की बताई जा रही है। 😳😳#haridwar pic.twitter.com/IY9bDp7DAb
— Ashok Basoya (@ashokbasoya) June 28, 2022
ఆ బామ్మ డైవింగ్ వీడియోని సుప్రీంకోర్టులో ఛత్తీస్‌గఢ్ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్‌గా చేస్తున్న అశోక్ బసోయా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘హర్ కీ పారీ వంతెనపై నుంచి ఓ 70 ఏళ్ల వృద్ధురాలు గంగానదిలోకి దూకి హాయిగా ఈత కొడుతోంది’ అంటూ ట్వీట్ చేశారు. అదే వీడియోని ఐపీఎల్ అధికారి దీపాన్షు కబ్రా కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఆ వృద్ధురాలి ధైర్యం, ఉత్సాహం చూస్తుంటే నమ్మశక్యంగా లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ క్రేజీ బామ్మ గంగానదిలోకి దూకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
वीडियो देखकर मैं पहले तो चौंक गया पर दादीजी तो माहिर तैराक निकलीं. वे करीब 70 साल की हैं. जिस दिलेरी और उत्साह से उन्होंने हर की पौड़ी पुल से गंगा में छलांग लगाई और तैरते गयीं वह अविश्वसनीय है.
वाकई उम्र आपको कभी भी कुछ भी करने से नहीं रोक सकती. pic.twitter.com/iC1Z9extwN
— Dipanshu Kabra (@ipskabra) June 28, 2022