నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. డుగ్గు డుగ్గు ఈ పాటకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు పెళ్లి అంటే బుల్లెట్టు బండి పాట ఎప్పుడు అని అడుగుతున్నారు. అంత ఫేమస్ అయ్యింది ఆ సాంగ్. పెళ్లి బారాత్, ఆస్పత్రులు, రోడ్లు ఎక్కడంటే అక్కడ తెగ వైరల్ అయ్యింది. ఒక్క తెలంగాణ అనే కాదు, దేశం మొత్తం ఇప్పుడు బారాత్‌లో కొత్త జంట కలిసి డాన్సులు చేయడం ట్రెండ్ అయి పోయింది. కపుల్ సాంగ్ లేకుండా పెళ్లి జరిగే పరిస్థితులు కనిపించడంలేదు. అలా డాన్స్ చేసిన ఓ కాబోయే జంట వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యింది.
ఈ వీడియోని ఎజ్‌వెడ్.ఇన్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఓ జంట బాగా పాత పాట అయిన ‘ఫిజికల్లీ ఫిట్’ అని ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్‌లో ట్రెండ్ అవుతున్న పాటకు స్టెప్పులేశారు. ముందు యువతి డాన్స్ చేస్తుండగా ముందు డీలాగా ఉన్న వరుడు ఒక్కసారిగా కాలు కదుపుతాడు వాళ్లు వేసిన ఆ స్టెప్పులు దాదాపు 10 లక్షల మందికి పైగానే చూశారు. వారిలో దాదాపు 3.5 లక్షల మంది లైక్ చేశారు. గోయింగ్ విత్ ట్రెండ్ ప్రతీక్, మౌల్యా అని జంటను ట్యాగ్ చేశారు. మరి ఆ ట్రెండింగ్ వీడియోని మీరు కూడా చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.