ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ల ట్రెండ్ బాగా నడుస్తోంది. జీవితాంతం గుర్తుండిపోవాలనే ఆలోచనతో పెళ్లి జంటలు కొత్త కొత్తగా ఫోటోషూట్ లు సిద్ధమవుతున్నారు. పెళ్లికి ముందు వధువు, వరుడు కలసి రకరకాల స్టైల్లో ఫోటోలకు ఫోజులిస్తుంటారు. ఒక్కోసారి ఈ వెడ్డింగ్ షూట్లు అచ్చం సినిమాల్లో హీరో, హీరోయిన్ల మధ్య సాగే రోమాంటిక్ సన్నీవేశాలను కూడా తలపిస్తున్నాయి. అంతలా ఈ షూట్లు శృతిమించిపోతున్నాయి. చక్కగా ముస్తాబై సమాధుల్లో పడుకుని కూడా ఫోటోలు తీయించుకున్నారు. అతేకాక నది మధ్యలో, ఆకాశంలో కొండల అంచుల ఇలా ఒక్కటేంటి అనేక రకాలు.. సినిమాలకు తీసిపోకుండా ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతున్నాయి. తాజాగా మరో జంట సైతం భిన్నంగా తమ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసింది. యాక్షన్ సినిమాలో మాదిరి బైక్ తో స్టంట్ లు చేశారు.
పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ కొత్త జంట తమ ప్రీ వెడ్డింగ్ షూట్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రికరించింది. అందరిలా చేస్తే ఏముందని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. యాక్షన్ సినిమాల్లో మాదిరి బైక్ పై స్టంట్ చేశారు. సినిమాలో చూపించినట్లుగా సుమోపై నుంచి బైక్ తో జంప్ చేసే స్టంట్ ను ఆ నవ దంపతులు చేశారు. వధువరులు పెళ్లిమండపం మాదిరిగా పెళ్లి దుస్తులో బైక్ పై కూర్చోన్నారు. ప్రక్కన ఉన్నవారు తాళ్లు, క్రేన్ సాయంతో బైక్ ను సుమో కారుపై నుంచి జంప్ చేసినట్లు సీన్ ను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై భిన్నమైన కామెంట్స్ వినిపిస్తోన్నాయి.
సంతోషంగా పెళ్లి చేసుకోవాల్సిన సమయంలో ఇలాంటి రిస్క్ లు అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వీరి పిచ్చి పీక్ చేరిందని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ వెడ్డింగ్ షూట్‌లు పెళ్లిలో అంతర్భాగం అయిపోయాయి. అందరికన్నా తమ వెడ్డింగ్ షూట్ చాలా భిన్నంగా ఉండాలని .. జంటలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే వీటి కోసం పెద్ద పెద్ద సాహసాలకు కూడా వెనుకాడడం లేదు. అలా ప్రమాదకర సాహసాలు చేసి కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
pre-wedding shoots – i’m getting this pic.twitter.com/Ynwf7Kxr6a
— Best of the Best (@bestofallll) October 27, 2022