పెళ్లయి గంటలు కూడా గడవక ముందే ఇద్దరూ కాలేజ్‌కు బయలు దేరారు. యువతి పరీక్షలు రాసింది. ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే, నెటిజన్లు మాత్రం యువతిపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు..
ఆ యువతీ, యువకుడికి అప్పుడే పెళ్లయింది. పెళ్లి బట్టలతోనే ఆ ఇద్దరూ ఓ కాలేజ్ దగ్గరకు వెళ్లారు. అక్కడి లెక్షరర్ల ఆశీర్వాదం తీసుకోవటానికి అయితే మాత్రం కాదు.. ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయటానికి. పెళ్లి కూతురుకు ఎగ్జామ్ ఉండటంతో పెళ్లి కుమారుడే స్వయంగా ఆమెను కాలేజ్‌కు తీసుకుని వచ్చాడు. ఈ విషయం తెలిసిన కాలేజ్ యజమాన్యం ఆశ్చర్యానికి గురైంది. ఆమెకు చదువు మీద ఉన్న ఆసక్తికి అమితానందపడింది. అయితే, నెటిజన్లు మాత్రం ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. నెటిజన్లు ఎందుకు ఆమెను తిడుతున్నారు? ఇంతకీ ఏం జరిగిందంటే..
తమిళనాడు, అరియాలూరు జిల్లాలోని మేకవల్ పుత్తూరుకు చెందిన ఇందుమతి కుంబకోణంలోని ఓ కాలేజ్‌లో మాస్టర్స్ చదువుతోంది. ఆమెకు కడలూర్ జిల్లాలోని కుట్టుమన్నర్ కోవిల్‌కు చెందిన సుదర్శన్‌తో కొద్దిరోజుల క్రితం పెళ్లయింది. ఉదయం పెళ్లి అయిన వెంటనే ఆమె కాలేజీకి వెళ్లటానికి సిద్ధమైంది. అదే రోజు ఆమెకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆమె తన భర్తతో కలిసి నేరుగా కాలేజ్ దగ్గరకు వెళ్లింది. తన తోటి విద్యార్థులతో కలిసి ప్రాక్టికల్స్‌లో పాల్గొంది. పెళ్లి అయిన వెంటనే ప్రాక్టికల్స్ కోసం వచ్చిన ఆమెను కాలేజ్ యజమాన్యం పొగడ్తలతో ముంచెత్తింది.
భర్తతో కలిసి ప్రాక్టికల్స్ కోసం ఇందుమతికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ‘‘ ఈ మధ్యకాలంలో ప్రమోషన్ల కోసం ఈ విధంగా చేయటం ఎక్కువయిపోయింది’’.. ‘‘ మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంటి? వైరల్ అవ్వటం కోసం ఇలా చేయాలా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, సదరు యువతి పెళ్లి బట్టలతో ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో పాల్గొనటం ప్రమోషన్ కోసమేనని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
மணக்கோலத்தில் வந்து தேர்வெழுதிய கல்லூரி மாணவி!#SunNews | #Kumbakonam | #Marriage pic.twitter.com/g1yX9e6gT6
— Sun News (@sunnewstamil) April 10, 2023