ఈ సృష్టిలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే.. తన బిడ్డల ప్రాణాలను రక్షించుకోవటానికి తల్లి ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. ఏకంగా ప్రాణాలనైనా వదిలేస్తుంది. బిడ్డ కోసం ఆఖరి రక్తపు బొట్టువరకు పోరాడుతుంది. తాజాగా, ఓ మహిళ తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. తన కుమారుడిపై దాడికి దిగిన ఆవుతో తీవ్రంగా పోరాడింది. చాలా కష్టపడి దాన్నుంచి బిడ్డను కాపాడుకుంది. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్, మోర్బీలోని లక్ష్మీ నారాయణ సొసైటీకి చెందిన ఓ మహిళ అక్టోబర్ 21న తన బిడ్డతో కలిసి రోడ్డుపై వెళుతోంది.
ఈ నేపథ్యంలోనే ఇద్దరూ నడుచుకుంటూ మలుపు దగ్గరకు వచ్చారు. అక్కడే ఉన్న ఓ ఆవు చిన్నగా నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చింది. బాలుడిపై కొమ్ములతో దాడి చేయటానికి ప్రయత్నించింది. ఆవు తన బిడ్డపై దాడి చేయటానికి వచ్చిందని గ్రహించిన ఆ మహిళ ఓ చేత్తో తన బిడ్డను వెంటనే పక్కకు లాగింది. ఆ వెంటనే మరో చేత్తో ఆవు కొమ్మును పట్టుకుంది. అయినా ఆవు బిడ్డను వదిలిపెట్టలేదు. పొడవటానికి ముందుకు దూకింది. బాలుడి తల్లి భయపడకుండా బిడ్డను పట్టుకునే ఉంది. ఆవు ఇద్దర్నీ ముందుకు తోసుకుపోయింది. కొమ్ములతో కుమ్మసాగింది.
ఇంతలో అక్కడికి వచ్చిన కొందరు యువకులు దాన్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. అయినా అది వదల్లేదు. వారిని కూడా దూరంగా తరిమేసింది. జనం అరుపులు విని పరుగున అక్కడికి వచ్చిన రెండు కుక్కలు ఆవు కుమ్ముతున్న తీరు చూసి భయపడిపోయాయి. వెంటనే అక్కడినుంచి వెనక్కు పరుగులు తీశాయి. కొద్దిసేపటి తర్వాత పెద్ద సంఖ్యలో జనం అక్కడ జమకూడారు. ఆవును తరిమికొట్టి బిడ్డను పక్కకు తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
મોરબી:- ગાયે માતા અને બાળકને ચગદી નાખવાનો પ્રયાસ કર્યો, લોકો એકઠા થઈ જતાં માંડ માંડ જીવ બચ્યો#Morbi #Cow #StrayCattle #Animal #AnimalAttack #CowAttack #MorbiNews #Gujarat #ConnectGujarat #BeyondJustNews pic.twitter.com/N69YlldXnt
— ConnectGujarat (@ConnectGujarat) October 22, 2022