ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే కోతి చేష్టలు చేయకురా అని తిడుతుండడం సహజం. ఎందుకంటే.. కోతులు చేసే పనులు అలా ఉంటాయి. ఇంట్లోకి దూరి కొబ్బరి చిప్పలు ఎత్తుకెళ్ళడం, ఎవరి చేతిలోనైనా తినేవి కనబడివే లాక్కెళ్లడం.. లాంటివి. కానీ, మన కథలో ఒక కోతి, ఎవరి చేతిలోనైనా లాక్కెళ్తే మనకు తినేది దక్కదని.. ఏకంగా కలెక్టర్ చేతిలో ఉన్న కళ్లజోడు ఎత్తుకెళ్ళింది. దీంతో దాన్ని పట్టుకోవడానికి పదుల సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఉత్తరప్రదేశ్, మథుర జిల్లా, బృందావనంలోని బాంకే బిహారీ మందిర్ పరిధిలో అధికారులు, ఇతర సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ నవనీత్ చాహల్ నడిచి వెళ్తున్నారు. ఈ సమయంలో ఆయన మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్తుండగా, ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి ఆయన భుజంపైకి వచ్చి కూర్చొంది. ఆ వెంటనే.. ఆయన కళ్లద్దాలను ఎత్తుకెళ్లి పక్కనున్న ఇంటి ఇనుప మెట్లపై కూర్చొంది. కలెక్టర్‌తోపాటు ఇతర సిబ్బంది, పోలీసులు కళ్ల జోడు కోసం తెగ ప్రయత్నించారు. వీరందరూ ఎంత మొర పెట్టుకున్నా కళ్లద్దాలను మాత్రం.. ఆ కోతి తిరిగి ఇవ్వలేదు. ఇలా అయితే.. పనవ్వదని పోలీసులు రెండు ఫ్రూటీలను కోతి వద్దకు విసిరారు. దీంతో అది కళ్లజోడును పక్కన పడేసి ఫ్రూటీ ప్యాకెట్ చేతికి అందుకుంది. ఈ ఘటనను అక్కడున్న వారందరు తమ మొబైల్ లో బంధించారు.
बंदर ने सोचा जब भाजपा के शासन में प्रशासन को चश्मा लगाकर भी कुछ नहीं दिखता है तो चश्मे का क्या काम… pic.twitter.com/LlGaC1eD00
— Akhilesh Yadav (@yadavakhilesh) August 21, 2022
చివరకు ఈ వీడియో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ వరకు చేరడంతో.. బీజేపీ పాలనను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. “బీజేపీ పాలనలోని దుష్ప్రవర్తనను అధికారులు చూడటం లేదు. దీంతో వారికి కళ్లజోడు అవసరం లేదని భావించిన కోతి దానిని తీసుకెళ్ళింది” అని క్యాప్షన్ జోడించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Frooti nexus..10 rs ki 15 rs mai bikti hai..monkeys are so aptly trained..sirf frooti se maante hain
— Aditi Bhowmik (@AditiBhowmik17) August 22, 2022