కుటుంబం కోసం కష్టపడుతూనే తన ఆర్మీ కలను నెరవేర్చుకోవటానికి ప్రతిరోజు అర్థరాత్రిళ్లు రోడ్డుపై 10 కి.మీ. పరిగెత్తుతున్న యువకుడు ప్రదీప్ మెహ్రాకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాడు. అన్ని వర్గాల నుంచి అతడికి ప్రశంసలు వస్తున్నాయి. అంతే కాదు కొంతమంది ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. గతంలో భారత ఆర్మీ మాజీ లెఫ్ట్ నెంట్ తనవంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రదీప్ తల్లి చికిత్స కోసం, అతని కల నెరవేరేందుకుగానూ రెండున్నర లక్షల రూపాయల చెక్ సాయం అందించింది షాపర్స్ స్టాప్. ఈ విషయాన్ని మొదటి నుంచి మెహ్రాకు తోడుగా ఉంటున్న జర్నలిస్ట్, దర్శకుడు వినోద్ కాప్రీ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. తనకు సాయం అందిస్తున్న వాళ్లకు ప్రదీప్ సైతం కృతజ్ఞతలు చెప్తున్నాడు.
This morning @atulkasbekar took my address and with in few hours , a @PUMA sports kit with Running shoes, Apparels, backpack , socks was there at my door step for #PradeepMehra and with in no time we delivered it to him.
Love you Atul ❤️
love you Tweeple❤️❤️
Thanks #Puma pic.twitter.com/MZws0nBd8L— Vinod Kapri (@vinodkapri) March 21, 2022
ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్ కుటుంబంతో కలిసి నోయిడాలో ఉంటున్నాడు. సెక్టార్ 16లోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. రాత్రి డ్యూటీ అయిపోగానే రోడ్డుపై పరిగెత్తుకుంటూ వెళ్తుతుంటాడు. ఓ రోజు డైరెక్టర్ వినోద్ కాప్రీ అతడ్ని చూసి ఎందుకు పరిగెత్తుతున్నావని ప్రశ్నించాడు. తాను ఆర్మీలో చేరటానికి ఇలా ప్రతి రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తుతానని చెప్పాడు. తన కుటుంబ ఆర్థిక కష్టాలను కూడా ఆయనకు చెప్పుకున్నాడు. అతడి పట్టుదల, కార్యదీక్ష చూసి మురిసిపోయిన వినోద్ ఇందుకు సంబంధించిన వీడియో తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రదీప్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అతనికి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న చాలామంది ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This is PURE GOLD❤️❤️
नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया
मैंने सोचा
किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिएबार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया
वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊 pic.twitter.com/kjBcLS5CQu
— Vinod Kapri (@vinodkapri) March 20, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.