Love Story: ఆమె ఓ ఎంబీబీఎస్ డాక్టర్.. అతడు ఓ అటెండర్. అతడి మీద ఆమెకు ఎప్పుడు, ఎలా, ఎందుకు ప్రేమ పుట్టిందో తెలియదు కానీ, పుట్టేసింది. అతడు తన కంటే స్థాయిలో చాలా తక్కువ అని తెలిసినా ప్రాణంగా ప్రేమించింది. అతడు లేకపోతే బతకలేను అనుకుంది. అతడు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. వెంటనే ఐ లవ్ యూ చెప్పింది. దానికి అతడు ఎలా స్పందించాడు? పెళ్లి ఎలా జరిగింది? అన్నది తెలుసుకోవాలంటే మొత్తం మ్యాటర్ చదివేసేయండి. వివరాలు.. పాకిస్తాన్, ఒకరా తెహ్‌సిల్‌లోని దిపాల్‌పూర్‌కు చెందిన కిశ్వార్ సాహిబా ఓ ఎంబీబీఎస్ డాక్టర్. టౌన్‌లోని ఓ హాస్పిటల్‌లో వైద్య సేవలు అందిస్తోంది. షహ్‌జాద్ అనే వ్యక్తి అదే హాస్పిటల్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. సాహిబాకు ప్రతీ రోజు టీ ఇవ్వటానికి వెళ్లేవాడు.
అంతేకాదు! అప్పుడప్పుడు ఆమె రూమును క్లీన్ కూడా చేసేవాడు. మొదటి చూపులోనే షహ్‌జాద్ ఆమెకు నచ్చేశాడు. ‘‘అస్సలు పనోడిలా లేడే’’ అనుకుంది. అతడి మీద మనసు పారేసుకుంది. తర్వాత నుంచి ప్రతీరోజు అతడి కోసం ఎదురు చూసేది. ఓ రోజు అతడితో మాటలు కలిపింది. ఇద్దరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె అతడి ఫోన్ నెంబర్ అడిగింది. ఇక, ఫోన్‌లో కూడా తరచుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఓ రోజు షహ్‌జాద్ పెట్టిన వాట్సాప్ స్టాటస్‌ను సాహిబా లైక్ చేసింది. మరుసటి రోజు అతడు అనుకోని విధంగా ‘ఐ లవ్ యూ’ అని చెప్పింది. షహ్‌జాద్ ఆమె చెప్పిన దానికి షాక్ తిన్నాడు.
జ్వరం కూడా వచ్చింది. తర్వాత అతడు కూడా ఆమె ప్రేమను అంగీకరించాడు. ఇద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత షాహిబాకు స్నేహితుల వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఉద్యోగం మానేసింది. త్వరలో స్వయంగా ఓ క్లీనిక్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు. ఆ ఇద్దరినీ మేరా పాకిస్తాన్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో వారు తమ ప్రేమ విషయాలు చెప్పుకొచ్చారు. మరి, ఎంబీబీఎస్ డాక్టర్, అటెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Viral Video: వీడియో: ఫోన్ కోసం ప్రాణాలకు తెగించి దొంగతో పోరాడిన యువతి!