Viral Video: ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆడ, మగ తేడా లేకుండా విచ్చల విడితనంగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లి తర్వాత వేరే వారితో కలిగే ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కట్టుకున్న వారిని కూడా లెక్కచేయటం లేదు. తాజాగా, ఓ మహిళ జనం నోరెళ్ల బెట్టే పని చేసింది. ప్రియుడ్ని కొడుతుంటే.. అడ్డుగా వెళ్లటమేకాకుండా అతడ్ని హత్తుకుని రక్షణగా నిలిచింది. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బిహార్, కతిహార్‌లోని లక్ష్మీపూర్‌కు చెందిన బబ్బన్ చౌదరికి అదే ప్రాంతానికి చెందిన ఆర్తీ కుమారి అనే మహిళతో 2 సంవత్సరాల క్రితం పెళ్లయింది.
పెళ్లి తర్వాత కొన్ని నెలలు ఆ జంట చక్కగా కాపురం చేసుకుంది. అయితే, 6 నెలల క్రితం కాపురంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆమె భర్తతో తెగతెంపులు చేసుకుంది. జౌనియా బస్తోల్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఇంటినుంచి పరారైంది. ఇక అప్పటినుంచి అతడితోనే ఉంటోంది. గత శనివారం ఆర్తీ, ఆమె ప్రియుడు లక్ష్మీపూర్ మీదుగా వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. బైకుపై ఊర్లోకి చేరుకున్న జంటను అత్తింటివారు, గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇద్దర్నీ దారుణంగా కొట్టసాగారు. తనను ఎంత కొట్టినా భయపడని ఆర్తీ ప్రియుడ్ని కొడుతుంటే చలించిపోయింది.
జనం ప్రియుడ్ని కొడుతుంటే ఆమె అతడ్ని గట్టిగా హత్తుకుని కొట్టొద్దని అరుస్తూ, ఏడుస్తూ ఉంది. గొడవ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జనం బారినుంచి ఇద్దర్నీ విడిపించారు. ఆర్తీ భర్త కూడా ఓ అమ్మాయిని తీసుకుని పారిపోయాడని పోలీసుల తెలిపారు. ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
कटिहार में प्रेमिका अपने प्रेमी को भीड़ से बचाते हुए, महिला शादी शुदा है और पति को छोड़ प्रेमी के पास चली गयी थी।#Bihar pic.twitter.com/8xlaoxy1vW
— Mukesh singh (@Mukesh_Journo) August 23, 2022
ఇవి కూడా చదవండి : వీడియో: పిల్లలతో కలిసి ఫుడ్ డెలివరీ.. ఆ తండ్రి ప్రేమపై నెటిజన్ల ప్రశంసలు!