కొన్ని పురాణ ఇతివృత్తాల ఆధారంగా మన చావును బ్రహ్మ ఫిక్స్ చేస్తాడని, చావు వచ్చే సమయంలో కొన్ని సూచనలు కనిపిస్తాయని, యముడు ప్రాణాలను హరిస్తాడని, ఆ తర్వాత పాపం చేస్తే నరకానికి, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళతారని పేర్కొంటున్నాయి. అదేవిధంగా పునర్జన్మలు ఉంటాయని విశ్వసిస్తారు. కానీ ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత బ్రతికి రావడం అనేది కల్ల.
స్వర్గ, నరకాలు ఎలా ఉంటాయో తెలియదు. చనిపోయాక ఆత్మ అనేది ఒకటుంటుందని, అది ఎక్కడికి వెళుతుందో తెలియదు. ఆకాశంలో దేవుళ్లు ఉంటారని, రంభ, ఊర్వశి, మేనకలు ఉంటారని కథకథలుగా చెబుతుంటారు. కొన్ని పురాణ ఇతివృత్తాల ఆధారంగా మన చావును బ్రహ్మ ఫిక్స్ చేస్తాడని, చావు వచ్చే సమయంలో కొన్ని సూచనలు కనిపిస్తాయని, యముడు ప్రాణాలను హరిస్తాడని, ఆ తర్వాత పాపం చేస్తే నరకానికి, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళతారని పేర్కొంటున్నాయి. అదేవిధంగా పునర్జన్మలు ఉంటాయని విశ్వసిస్తారు. కానీ ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత బ్రతికి రావడం అనేది కల్ల. అయితే కొన్ని సంఘటనలు మనల్ని మిరాకిల్స్ చేస్తుంటాయి. అటువంటి సంఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలు చేపట్టేందుకు సిద్ధమౌతుండగా లేచి కూర్చున్నాడు.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని మోరెనాలోని శాంతిధామ్‌కు చెందిన జీతూ ప్రజాపతి అనే వ్యక్తి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే ఇటీవల అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే అతడు పడిపోవడాన్ని చూసిన స్థానికులు.. శ్వాస ఆడటం లేదని గుర్తించారు. వెంటనే అతడు చనిపోయాడని నిర్ధారించారు. బంధువులు, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు.. శాంతిథామ్ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఏడుపులు, పెడబొబ్బలు మధ్య అంతిమ యాత్ర కొనసాగుతుంది. అంతలో ఒక్కసారిగా ప్రజాపతి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అంతే ఒక్కసారిగా అక్కడ ఉన్న జనం భయపడ్డారు.
ఆ తర్వాత తేరుకున్న అక్కడి వారు..వెంటనే సమీపంలోని వైద్యున్ని సంప్రదించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వైద్యుడు.. అతడి గుండె కొట్టుకుంటుందని గుర్తించాడు. వెంటనే చికిత్స నిమిత్తం గ్వాలియర్ వైద్య సదుపాయానికి తరలించేందుకు ఏర్పాటు చేశారు. అయితే ఈ మొత్తం పరిణామాల పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఎలా బతికి వస్తారంటూ ఇదొక మిరాకిల్ అంటూ మాట్లాడుకుంటుండగా, అయితే అతడు డీప్ స్లీప్‌కు వెళ్లి ఉంటాడని వైద్యులు భావిస్తున్నారు. ఇటువంటి ఘటనల గురించి మీరు విని ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.