ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రక రకాల వీడియోలు దర్శనమిస్తున్నాయి. అందులో కొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటే.. మరికొన్ని కన్నీరు తెప్పించే విధంగా ఉంటాయి. ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. వాహనదారుల్లో మార్పులు రావడం లేదు. ఓ వాహనదారుడు బైక్ పై కెపాసిటికి పైగా వస్తువులు తీసుకు వెళ్తున్నాడు.. దీని మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.
సాధారణంగా ఎవరైనా స్కూటీపై మార్కెట్ కి వెళ్తే కొంత లగేజీని తీసుకు రావడం చూస్తుంటాం. అయితే కొంతమంది మాత్రం వాహనాల సామర్ధ్యాలకు మించి సామాన్లు తీసుకు వెళ్తూ నానా అవస్థలు పడుతుంటారు. ఓ వ్యక్తి స్కూటీపై సామర్ధ్యానికి మించి కాదు.. ఒక చిన్నపాటి షాపు నే తరలిస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఆ స్కూటీపై కెపాసిటికి మించి సామాను తీసుకు వెళ్తున్నాడు.
ఈ వీడియోని వెనుక నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. స్కూటీపై వెళ్తున్న వ్యక్తి చాలా డేంజర్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. అతను హ్యాండిల్ కూడా అందుకోలేనంద చివర్లో కూర్చొని నేలకు కాళ్లు ఆనిస్తూ నడుపుతున్నాడు. మొత్తానికి ఇది నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని తెలంగాణ పోలీసులు కూడా షేర్ చేశారు. ఇలాంటి ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకు ప్రమాదం అని చెబుతున్నారు. నెటిజన్లు ఈ వీడియో చూసిన తర్వాత తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
My 32GB phone carrying 31.9 GB data pic.twitter.com/kk8CRBuDoK
— Sagar (@sagarcasm) June 21, 2022