మన సమాజంలో అన్నాచెళ్లెల్ల బంధానికి ఎంతో పవిత్రత ఉంది. తోడబుట్టిన వాళ్లనే కాక.. పరాయి మొగాళ్లను కూడా అన్న అనే పిలుస్తారు చాలా మంది ఆడవాళ్లు. ఆ పిలుపులో వారికి రక్షణ కనిపిస్తుంది. అన్న అని పిలిస్తే.. ఆ మగాళ్లకు తమపై చెడు ఉద్దేశాలు కలగవని నమ్ముతారు. అన్న అంటే అంత పవిత్రమైన బంధం. కానీ ఇక్కడో విచిత్రం జరిగింది. ఓ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో సొంత చెల్లినే వివాహం చేసుకున్నాడు. ఆరేళ్ల తర్వాత ఆ విషయం అతడికి తెలిసింది. మరి అతడి రియాక్షన్ ఎలా ఉంది అంటే..
ఆ జంటకు పెళ్లై ఆరేళ్లు.. ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఆ దంపతులను చూసిన వారు.. మేడ్ ఫర్ ఈచ్ అదర్.. అన్యోన్య దాంపత్యానికి నిలువెత్తు ఉదాహరణ అంటూ ప్రశంసలు కురిపిస్తారు. భార్యాభర్తలిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. రత్నాల్లాంటి ఇద్దరు బిడ్డలతో సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో.. ఓ అనారోగ్య సమస్య.. అల్లకల్లోలం సృష్టించింది. ఫలితంగా వారి భార్యాభర్తల బంధం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఏం చేయాలో పాలుపోక.. తన సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా సోషల్ మీడియాలో అభ్యర్థించాడు సదరు వ్యక్తి. వారి జీవితంలోకి వచ్చిన ఆ సమస్య ఏంటంటే.. ఆ దంపతులిద్దరూ స్వయంగా అన్నా చెళ్లెల్లు. చదవగానే ఆశ్చర్యంతో షాక్ అయ్యారా.. మరి వాస్తవం తెలుసుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మరి ఇదంతా ఎలా జరిగింది.. అన్నా, చెల్లెలు ఎందుకు వివాహం చేసుకున్నారు.. అంటే..
రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆ వ్యక్తికి ఆరేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే బాబు పుట్టిన కొన్నాళ్లకు.. సదరు వ్యక్తి భార్య.. అనారోగ్యానికి గురయ్యింది. కిడ్నీ సమస్య వెలుగు చూసింది. వైద్యులకు చూపించగా.. ఆమెకు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు. ఈ క్రమంలో భార్య తల్లిదండ్రులు, ఇతర బంధువులు అందరిని టెస్ట్ చేశారు. కానీ ఒక్కరి కిడ్నీ కూడా ఆమెతో మ్యాచ్ కాలేదు. దాంతో భార్యను కాపాడుకోవడం కోసం సదరు వ్యక్తి.. తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. టెస్ట్‌లు చేయగా.. అతడి కిడ్నీ మ్యాచ్ అయ్యింది. ఈ క్రమంలో వైద్యులు.. మరిన్ని టెస్ట్‌లు చేశారు. పరీక్షల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
అది ఏంటంటే.. సదరు వ్యక్తి, అతడి భార్య ఇద్దరు అన్నా చెళ్లెలు. ఇలా ఎలా జరిగింది అంటే.. సదరు వ్యక్తిని పుట్టిన కొన్ని రోజులకే వేరే వాళ్లకు దత్తత ఇచ్చారు. ఇక అతడికి తన బయోలాజికల్ తల్లిదండ్రుల గురించి ఎలాంటి సమాచారం తెలియదు. దాంతో చెల్లినే వివాహం చేసుకున్నాడు. పెళ్లై, ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత ఆ విషయం అతడికి తెలిసింది. ఏం చేయాలో పాలుపోక.. తన కథను రెడ్డిట్‌లో పోస్ట్ చేసి.. సలహా కోరాడు.
చాలా మంది నెటిజనులు.. మీకు తెలియకుండా తప్పు జరిగింది.. పెళ్లి చేసుకున్నారు.. పిల్లలు కూడా ఉన్నారు. ఇక అలానే కంటిన్యూ అవ్వండి అనగా.. కొందరు మాత్రం.. ఎంత కాదనుకున్న ఆమె మీ చెల్లి అనే వాస్తవం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. చెల్లెలితో కాపురం చేయడం.. అనే ఊహను కూడా భరించలేం.. ఇక మీ పిల్లలకు కూడా దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. విడిపోయినా ఇబ్బందే.. కలిసున్నా కష్టమే.. మీ సమస్యకు పరిష్కారం అంత సులువు కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇతగాడి సమస్యకు మీరు ఎలాంటి పరిష్కారం సూచిస్తారు.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.