భారతీయులకు భక్తి భావం ఎక్కువ. ప్రతీ రోజు పూజలు చేసే వారు దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉన్నారు. వీళ్లను పక్కన పెడితే గుళ్లకు వెళ్లి దేవుళ్లను దర్శించుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది గుళ్లలోనే తమ భక్తి భావాన్ని బయటపెట్టేస్తుంటారు. పూజారి చెప్పినవి మాత్రమే కాకుండా చెప్పనివి కూడా చేస్తుంటారు. ఇంకా కొంతమంది కొత్త పద్దతుల్ని కూడా సృష్టిస్తుంటారు. ఆ కొత్త పద్దతుల్ని మిగిలిన వాళ్లు ఫాలో అవుతుంటారు. ఇది చాలా గుళ్లలో జరిగే విషయమై. ఇలా చేయటం వల్ల ఒక్కోసారి ఇబ్బందుల్లో కూడా పడాల్సి వస్తుంది. తాజాగా, ఓ వ్యక్తి ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యలో దూరి ఇరుక్కుపోయాడు. బయటకు రాలేక నానా తిప్పలు పడ్డాడు. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఓ ప్రముఖ గుడికి వెళ్లాడు. అక్కడ దేవుడి విగ్రహం ముందు ఓ ఏనుగు విగ్రహం ఉంది. అది రెండు అడుగులు ఉంటుంది. దాని నాలుగు కాళ్ల మధ్య సందు దాదాపు ఓ అడుగు ఉంటుంది. ఇక, ఆ కాళ్ల సందులోంచి దూరి ఇటు వైపు నుంచి అటు వైపునకు వెళితే.. మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. చాలా మంది భక్తులు దాన్ని ఫాలో అవుతుంటారు. లావుగా ఉన్న వాళ్లు దానిలోనుంచి దూరటానికి ఆలోచిస్తారు. కొంతమంది అలాగే దూరేస్తుంటారు. ఆ భక్తుడు కూడా బయటకు వస్తాననే నమ్మకంతో ఏనుగు నాలుగు కాళ్ల మధ్యలోంచి బయటకు రావటానికి ట్రై చేశాడు. అయితే, అతడు మధ్యలోనే ఇరుక్కుపోయాడు.
ఇటునుంచి అటు రాలేక నానా ఇబ్బందులు పడ్డాడు. అతడి అవస్థలు గమనించిన అక్కడి వారు అతడ్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకపోయింది. చాలా సేపు కష్టపడిన తర్వాత అతడ్ని బయటకు తీసుకొచ్చారు. అతడు బతుకు జీవుడా అని అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆ భక్తుడు ఏనుగు కాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన దృశ్యాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు అతడు చేసిన పనిని తప్పుబడుతుంటే, మరికొందరు అతడు కేవలం భక్తితోనే ఆ పని చేశాడని, ఎలాంటి దురుద్ధేశం లేదని అంటున్నారు.
Any kind of excessive bhakti is injurious to health 😮 pic.twitter.com/mqQ7IQwcij
— ηᎥ†Ꭵղ (@nkk_123) December 4, 2022