ప్రస్తుత ఆధునిక సమాజంలో అందరి జీవితాలూ ఉరుకుల.. పరుగుల.. ఆ పై పని ఒత్తిడి.. అదీ కాక.. ఆర్థిక సమస్యలు.. ఇలా ఇవన్నీ కలిసి మనిషిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఈ క్రమంలోనే మనం ఒక తోడుని లేదా ఓదార్పుని కోరుకుంటాం. ఇలా ఓదార్పు ఇవ్వడాన్నే ఒక వ్యాపరంగా చేసుకుంటే? ఇదే ఆలోచన ఇప్పుడు ఓ వ్యక్తికి వచ్చింది. అసలు ఆ ఆలోచన ఏంటి? ఆ వ్యక్తి ఎవరు? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో మెగాస్టార్ అందర్ని కౌగిలించుకుంటూ ఉంటాడు. అలా చేస్తే మనసులోని ఆందోళన పోతుందని చెప్తుంటాడు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాడు. కాకపోతే ఆ సినిమాలో హీరో ఉచితంగా కౌగిలించుకుంటే.. ఇతను మాత్రం గంటకు ఇంత అని వసూల్ చేస్తున్నాడు.. అతడే బ్రిటన్ బ్రిస్టల్ కు చెందిన ”ట్రెజర్”. తమ మనసులోని భావాల్ని ఇతరులతో పంచుకోలేక ఒంటరితనం అనుభవిస్తున్న వారికి భరోసా కల్పిస్తున్నాడు.
ఒత్తిడిలో, ఒంటరితనంతో బాధపడే వారు అతన్ని సంప్రదిస్తే.. ఇంటికి వచ్చి బాధితుడిని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంటాడు. అలాగే వారు చెప్పింది విని వారి ఆందోళన తగ్గేలా చేస్తాడు. దీని పేరు కడల్ ‘థెరపీ’. ప్రస్తుతం ఈ థెరపీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇదంతా ఊరికే కాదు.. గంటకు 75 పౌండ్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 7వేలు అన్నమాట.
అయితే కౌగిలించుకోడానికి అతడే ఎందుకు.. పైగా డబ్బులు దండగ.. అనే వారు సైతం ఉన్నారు. బంధువులో, స్నేహితులనో కౌగిలించుకుంటే సరిపోదా? అనుకుంటున్నారా.. అదీ నిజమే అనుకోండి. కానీ అందరికీ బంధువులు ఉండరు. కొందరికి స్నేహితులు కూడా ఉండరు. మానవ సంబంధాలు లేక పోవడం వల్ల ఎంతో మంది మానసికంగా కుమిలిపోతున్నారు. ఈ ఆధునిక సమాజంలో ఈ పోకడ మరింత తీవ్రంగా ఉంది. అందుకే ఇలాంటి వారికి స్వాంతన చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాపారం మెుదలుపెట్టానని ట్రెజర్ తెలిపాడు.
ప్రస్తుతం ఇది ఒక వృత్తిగా మారిపోయింది. ఈ వృత్తి కింద పనిచేసే వారిని ప్రొఫెషనల్ కడల్స్ అని పిలుస్తున్నారు. ఈ థెరపీలో భాగంగా కేవలం కౌగిలింతే కాకుండా స్నేహాన్ని, ఓ వ్యక్తి మనకు తోడున్నాడన్న భావనను వాళ్లలో కలిగిస్తామని ట్రెజర్ వివరించాడు. మరి ఓ కొత్త ఆలోచనతో వచ్చిన ట్రెజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tough job if you’re a Shafi’i. pic.twitter.com/P4nAHWSMYV
— Abdul Hamid Faruki (@TjpAbdul) July 12, 2022