viral video : ఫ్రెండ్‌పై ఉన్న కోపాన్ని అత్యంత అమానుషంగా తీర్చుకున్నాడో వ్యక్తి. జిమ్‌లో వర్కువుట్ చేస్తున్న సమయంలో 20 కేజీల బార్‌బెల్ ప్లేటును ఫ్రెండ్ తలపై వేశాడు. దాన్ని ఓ యాక్సిడెంట్‌గా చిత్రీకరించటానికి ప్రయత్నించాడు. చివరకు కోర్టులో అతడు చేసింది నేరంగా రుజువై జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన తుది తీర్పు తాజాగా వెలువడింది. వివరాల్లోకి వెళితే.. 2020 అక్టోబర్ 20వ తేదీన డార్విన్‌కు చెందిన శానే రేయాన్ ఫ్రెండ్‌తో కలిసి జిమ్‌కు వెళ్లాడు. అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. రేయాన్ ఫ్రెండ్ ఓ చోట బెంచిమీద చెస్ట్ ప్రెస్‌లు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రేయాన్ 20 కేజీల బార్‌బెల్ ప్లేట్‌ను తీసుకుని మందుకు వెళ్లాడు.
ఫ్రెండ్ దగ్గరకు రాగానే ఏదో కాలుకు తగిలినట్లు కిందపడ్డాడు. ఆ పడ్డం 20 కేజీల ప్లేటును ఫ్రెండ్ తలపై పడేశాడు. అది గట్టిగా తలపై పడింది. ఆ దెబ్బకు మూతి మొత్తం తీవ్రంగా గాయపడింది. పుర్రె ఎముక క్రాకు ఇచ్చింది. రేయాన్ మాత్రం ఏమీ ఎరుగనట్లు నటించటం మొదలుపెట్టాడు. అంబులెన్స్‌కు కాల్ చేసి విషయం చెప్పాడు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం బాధితుడు కోలుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా, ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది. కోర్టు రేయాన్‌ను దోషిగా తేల్చి 19 నెలల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీటీవీ రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: కాకుల మాస్టర్ ప్లాన్.. ఆనంద్ మహీంద్రా ఫిదా!