viral video: రాంగ్‌రూట్‌లో వచ్చి తనను బైకుతో ఢీకొట్టాడన్న కోపంతో ఓ యువకుడిని బూటుతో చితకొట్టిందో యువతి. నడి రోడ్డులో అందరూ చూస్తుండగా ఈ పని చేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం మధ్యప్రదేశ్, జబల్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు బైకుపై వెళుతున్నాడు. ఓమటి పోలీస్ స్టేషన్ పరిధిలోని రసల్ చౌక్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు వచ్చాడు. బైకు అదుపు తప్పి అక్కడ రోడ్డు పక్కన ఆపి ఉన్న ఓ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీ మీద ఉన్న యువతి ఫోన్‌లో మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది. అది కూడా అతడు రాంగ్ రూట్‌లో వచ్చి ఆ స్కూటీని ఢీకొట్టాడు. దీంతో సదరు యువతికి కోపం కట్టలు తెగింది.
అతడిని బూటు తీసి మరీ చితకొట్టింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా చితకబాదింది. పక్కన ఉన్న వాళ్లు ఎంత చెప్పినా వినలేదు. తన పని చేసుకుపోయింది. ఈ సంఘటన కారణంగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. డ్యూటీలో ఉన్న పోలీసులు న్యూసెన్స్ చేస్తున్నారంటూ ఇద్దర్నీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతడికి ఫైన్.. ఆమెకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రియురాలిని కలిసేందుకు వెళ్లి.. ఆమె ఇంటి ముందు కుప్పకూలిన ప్రియుడు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.