వరుస చైన్ స్నాచింగ్ ఘటనలతో మహిళలు భయంతో వణికిపోతున్నారు. ఇక అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. అయితే ఇద్దరు యువకులు పట్టపగలు మహిళ మెడలో ఉన్న చైన్ ను దొంగిలించాలని అనుకున్నారు. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయింది.
గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మహిళలనే టార్గెట్ గా చేసుకుని వారి మెడలో ఉన్న బంగారు గొలుసులను తెంపుకుని పరారవుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఏపీలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు వెలుగు చూశాయి. అయితే ఈ వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు మరువక ముందే తాజాగా మరో ఘటన చోటు చూసుకుంది. ఓ మహిళ తన కూతురితో పాటు ఆటో దిగి మెల్లగా రోడ్డు దాటుతుంది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు ఆ మహిళపై కన్నేశారు. ఎలాగైనా ఆమె మెడలో ఉన్న చైన్ ను దొంగిలించాలని అనుకున్నారు.
ఇక ఆ యువకులు అనుకున్నట్లుగానే ఆ మహిళ వద్దకు మెల్లగా వెళ్లారు. వెంటనే ఆమె మెడలో ఉన్న చైన్ తీసుకుని పరుగెత్తాలని అనుకున్నారు. ఇక అలెర్ట్ అయిన ఆ మహిళ.. అతడి చొక్కా పట్టుకుని కిందపడేంది. దీనిని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని ఆ దొంగను పట్టుకుని చితకబాదారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇదే వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. వీడియోను చూసిన చాలామంది ఆ మహిళ సాహసానికి హ్యాట్సాప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఇలా వరుస చైన్ స్నాచింగ్ ఘటనలతో మహిళలు రోడ్డు ఎక్కాలంటేనే భయంతో వణికిపోతున్నారు. చైన్ స్నాచర్లకు చుక్కలు చూపించిన ఆ మహిళ సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) April 21, 2023