ఈ మద్య కాలంలో రోడ్డుపై ఎవరైనా ప్రమాదంలో ఉన్నా.. ఇబ్బంది పడుతున్నా మనకెందుకులే అని వెళ్లిపోయే వారు చాలా మంది ఉన్నారు. ఎక్కడో అక్కడ మంచి మనసు ఉన్నవాళ్లు ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తుంటారు. అందుకే ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి అని పెద్దలు అంటుంటారు.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వైరల్ వీడియోలు నిమిషాల్లో ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది ఔత్సాహికులు తమ టాలెంట్ చూపించుకునే అవకాశం దొరుకుతుంది. కొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్వించేవిధంగా ఉంటే.. కొన్ని వీడియోలు కన్నీరు పెట్టించేలా ఉంటాయి.. కొన్ని వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. ఒక్క స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచంలో ఉండే అన్ని వింతలు మనం ఇట్టే చూడేయొచ్చు. తాజాగా ఓ చిన్న పాప వృద్దుడికి నీళ్లు తాపిస్తున్న వీడియో నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తుంది. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతన్న వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై ఓ వృద్దుడు కూర్చొని ఉంటాడు. ఆయన చేతులు వణికిపోతున్నాయి.. మంచినీళ్లు తాగడానికి ఆయన ఎంతో ఇబ్బంది పడటం చూసి అటుగా వెళ్తున్న ఓ చిన్నారి పాప ముసలాయన ఇబ్బందిని గమనించింది. ఆ చిన్న మనసు కి ఏమనిపించిందో తెలియదు కానీ.. వెంటనే అతని వద్దకు వచ్చి బాటిల్ తో నీళ్లు తాపించింది. ఆ పెద్దాయన వీపుపై చేయి వేసి మరో చేతితో బాటిల్ పట్టుకొని మంచినీరు తాగిస్తుంది.. ఆ సమయంలో పాప తండ్రి వచ్చి ఎత్తుకుని ముద్దు పెట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ సమయంలో కొంతమంది అక్కడ టీ తాగుతూ ఉండటం.. కుర్చీపూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ వృద్దుడి పరిస్థితి మాత్రం ఎవరూ పట్టించుకోలేదు.
రోడ్డు పక్కన ఆ వృద్దుడి దీన స్థితి చూసి చిన్న మనసు చలించిపోయింది.. వాటర్ బాటిల్ తో నీళ్లు తాపించింది. సాధారణంగా రోడ్డు పై ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మాకేందుకు లే అని పట్టించుకోకుండా వెళ్లిపోయే వాళ్లు ఎంతో మంది ఉంటారు. అలాంటిది ఓ చిన్న పాప పెద్ద మనసు చేసుకొని పెద్దాయన పరిస్థితి గమనించి సహాయం చేసింది. అందుకే ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు చెబుతుంటారు. సమాజంలో కొంత మంది ఆ సూక్తిని పాటిస్తూ ఉంటారు.. ఆచరిస్తూ ఉంటారు. రోడ్డుపై ఎవరికైనా కష్టం వస్తే తమకు చేతనైనంత సహాయం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలు చూసినపుడు వారి ఔదార్యం మెచ్చుకుంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తుంటారు. తాజాగా చిన్నారి పెద్ద మనుసు చాటుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. చిన్నారిని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.