పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. పెళ్లి ద్వారా విభిన్న భావాలు కలిగిన ఇద్దరు.. ఒకటవుతారు. ఈ పెళ్లి తరువాత ఇద్దరి జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా అమ్మాయిల జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. అమ్మాయిలు తమకి భర్తగా వచ్చే అబ్బాయి విషయంలో చాలా ఆశలు పెట్టుకుంటారు. కానీ కొందరికి తాము అనుకున్న విధంగా భర్త ఉండరు. కానీ ఓ అమ్మాయి మాత్రం కాబోయే భర్త విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టింది. వాటితో ఏకంగా ఓ అగ్రిమెంట్ నే రాసేసింది. తనను పెళ్లి చేసుకోనున్న వ్యక్తి చేత ఆ అగ్రిమెంట్ పై సంతకం చేయించుకుంది. ప్రస్తుతం ఆ పెళ్లి కూతురు రాసిన షరతులతో కూడిన లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. ఆ అమ్మాయి అగ్రిమెంట్ లో రాసిన కండిషన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఆ అగ్రిమెంట్ లో ఆ అమ్మాయి ఏమి రాసిందో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు.. ఇంతకీ ఈ పెళ్లి కూతురు ఏమి రాసిందో చూద్దాం..తనకు కాబోయే భర్త నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలట. ఇంట్లో వండిన అన్నం తినడానికి ఎప్పుడు సరే అన్నాలంట. ఇంట్లో రోజూ చీర కట్టుకోవడానికి ఒప్పుకోవాలట. అలాగే.. లేట్ నైట్ పార్టీస్ తనతో మాత్రమే జరుపుకోవాలట. ప్రతి రోజు వ్యాయమానికి తప్పని సరిగా వెళ్లాలంట. ప్రతి ఆదివారం ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ని భర్తే ప్రిపేర్ చేయాలట. వెళ్లిన ప్రతి పార్టీలో ఆమెతో కలిసి ఒక మంచి ఫోటోను తీసుకోవాలట.
ప్రతి పదిహేను రోజులకు ఒకసారి షాపింగ్ కి తీసుకెళ్ళాలట. ఇలా కొన్ని కండిషన్స్ తో అగ్రిమెంట్ రాసింది. కోసమెరుపు ఏమిటంటే.. ఆ షరతులపై సంతకం చేసేందుకు పెళ్లి కొడుకు సిద్ధమైయాడంటా. ఈ కండిషన్స్ ను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. నీ పని అలా ఉంది అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ అగ్రిమెంట్ లెటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.