ప్రతి తల్లిదండ్రులకు పిల్లలను పెంచడమే ఓ పెద్ద టాస్క్. ఎందుకంటే వాళ్లు చేసే అల్లరి మాములుగా ఉండదు. కొందరు పిల్లలు అయితే
ఓ రేంజ్ లో అల్లరి చేస్తుంటారు. కొందరు అన్నం తినేటప్పుడు, మరికొందరు నిద్రపోయే సమయంలో తెగ విసిగిస్తుంటారు. ఇక కొందరు పిల్లలు అయితే చదువుకోమంటే ఎక్కడలేని కారణాలు చెబుతుంటారు. బడికి వెళ్లే మొదటి దశలో పిల్లలు ఇంటిని వదిలి ఎక్కువ ఉండలేకపోవడంతోనో, ఆడుకోవాలని అనిపించో.. పలక, పుస్తకం పట్టడానికి మొండికేస్తుంటారు. చదువు వద్దు ఆటలే కావాలంటూ పట్టు పడుతుంటారు. తాజాగా చదువు నుంచి తప్పించుకోవడానికి ఓ పిల్లాడు చెప్పిన కారణం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. చదువు వద్దు మమ్మీ.. రోజూ చదువుకంటే ముసలివాడిని అయిపోతాను అంటూ ఎంతో క్యూట్ గా ఆ చిన్నోడు చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఇక వీడియోలో.. నాలుగేళ్ల చిన్నారి పుస్తకం ముందేసుకుని కూర్చుకున్నాడు. పక్కనే ఉన్న ఆ బుడ్డోడి తల్లి.. అతడిని చదవాలని చెప్తుంది. అయితే ఆ చిన్నారి బుంగమూతి పెట్టుకుని చదువుకోను అంటూ మారం చేస్తుంటాడు. ఏమైంది, ఎందుకు చదవవు అని ఆ తల్లి అడిగింది. “ఎంత సేపు చదవాలి. చదివీ చదివీ ముసలాడిని అయిపోయేలా ఉన్నాను”అని అంటూ కన్నీరు పెట్టుకుంటాడు. ఈ వీడియోను గుల్జార్ సాహబ్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఐదు లక్షలకుపైగా వ్యూస్ రాగా.. వేల కొద్దీ లైకులు, కామెంట్స్ వచ్చాయి. చదువు విషయంవలో పిల్లవాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. “చదవకుంటే జీవితం ఎట్లా మరి” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. “బుడ్డొడి ముద్దుముద్దు మాటలు వింటుంటే నవ్వకుండా ఉండలేకపోతున్నాం” అని ఇంకొందరు పేర్కొంటున్నారు.
ज़िन्दगी भर पढ़ाई करते करते बुड्ढा हो जाऊंगा 🥲😅 pic.twitter.com/D3XNoifVSm
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 28, 2022