నేటికాలంలో సోషల్ మీడియా ప్రభావంతో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో తెలిసిపోతున్నాయి. కేవలం మనుషులకు సంబంధించిన విషయాలకే కాక ఇతర అనేక వీడియోలు సైతం వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యి అందరిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పులులు, ఎలుగుబంట్లు జనవాసాల్లోకి వచ్చి హల్ చల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. కొన్ని సందర్భాల్లో ఇతర జంతువులపై దాడి చేసి చంపేసిన వీడియోలు కూడా వస్తుంటాయి. అయితే తాజాగా రెండు చిరుత పులులు ఫైటింగ్ చేసుకున్నాయి. అది కూడా కొబ్బరి చెట్టు ఎక్కి మరీ కొట్టుకున్నాయి. విన్నడానికి ఆశ్చర్యంగా ఉన్న కరెంట్ స్తంభం లాంటి కొబ్బరి చెట్టును చిరుతలు రెండూ అవలీలగా ఎక్కేసి ఫైటింగ్ చేసుకున్నాయి. వీటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లా సిన్నార్ తాలుక స్వాంగ్వీ గ్రామంలో ఘుమారే అనే రైతు కుటుంబం నివాసం ఉంటుంది. వారి ఇంటి వెనుక మొక్క జొన్న పొలం ఉంది. అక్కడ గట్టుపై రెండు చిరుతలు కనిపించాయి. మొదట ఒక చిరుత కొబ్బరి చెట్టు ఎక్కుతూ కనిపించింది. కొద్దిసేపటికి అది కిందికి దిగడానికి పయత్నిచింది. అయితే అదే సమయంలోనే మరో చిరుత కూడా అదే చెట్టుపైకి ఎక్కింది. ఈక్రమంలో రెండు చిరుతలు కొద్ది సమయం చెట్టుపై ఘర్షణ పడ్డాయి. అనంతరం రెండు చిరుత పులులు కొబ్బరి చెట్టు నుంచి దిగి సమీపంలోని అడవిలోకి పారిపోయాయి. చిరుతపులులు ఇలా నిట్టనిలువుగా చెట్టు ఎక్కుతూ కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. చిరుత పులుల గురించి ఘమరే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులుల కోసం బోన్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ రెండు చిరుతలు స్థలం కోసం పోరాడుకున్నాయని స్థానికులు భావిస్తున్నారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
If you wondered why the leopard climbed a coconut tree, see till the end🥺 pic.twitter.com/ArEe8XR5o6
— Susanta Nanda IFS (@susantananda3) September 18, 2022