అందరిలోనూ టాలెంట్ ఉంటుంది. అయితే కొన్ని కారణాలతో అవి మరుగున పడిపోతుంటాయి. మళ్లీ ఏదో ఓ సందర్భంలో బయటకు వస్తుంటాయి. ఎంత బిజీగా ఉన్న వాటి కంటూ కొంత సమయం కేటాయిస్తే ఆత్మ సంతృప్తి మిగులుతుంది. అలాగే అనుకున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి.
ప్రతి ఒక్కరికి కొన్నిఅభిరుచులు, కనిపించని టాలెంట్ ఉంటుంది. తాము సింగర్ కావాలని, డ్యాన్సర్ కావాలని లేదా హీరో, పెయింటింగ్, ఫోటోగ్రాఫర్ కావాలని భావిస్తుంటారు. అయితే పరిస్థితులు అనుకూలించక, తల్లి దండ్రుల ఒత్తిడి వల్లో, మరో ఇతర కారణాలతో తమలో ఉన్న కళను అణగదొక్కుకుని, చదువుకుని ఉద్యోగాలు సంపాదిస్తారు. తర్వాత పెళ్లి, పిల్లలు వంటి సంసార బాధ్యతల్లో మునిగి తేలుతారు. కడుపు నింపుకోవడం కోసం వృత్తి చేసి, తమ టాలెంట్‌ను నీరు గార్చేసుకుంటారు. కళ దాచేస్తే దాగదు కదా. ఏదో ఓ సందర్భంలో బయట పడాల్సిందే. అదిగో అలాంటి సంఘటనే ఇదండి.
అద్బుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించలేరు..జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదని ఓ ప్రముఖ డైరెక్టర్ డైలాగ్ ఇతగాడికి సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన మంగీలాల్ వృత్తి రీత్యా తాహశీల్దార్. ఆ ఊరికి ఎంఆర్ఓ అయినప్పటికీ, తనలోని కళను అణగదొక్కుకోలేదు. వీలు చిక్కినప్పుడల్లా తనలోని డ్యాన్స్ టాలెండ్‌ను ప్రదర్శిస్తున్నారు. జనాలేమీ అనుకుంటారని అస్సలు సిగ్గు పడటం లేదు. చింతకాని మండలంలో ఎక్కడా ఫంక్షన్ జరిగిన మంగీలాల్ తనదైన టాలెంట్ ను బయటకు తీస్తున్నారు. డాన్స్ తో అక్కడి ప్రజలను ఎంటర్ టైన్ చేస్తున్నారు.
ఆయన డాన్స్ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది చూసినోళ్లు చిరంజీవి, మైకేల్ జాన్సన్, ప్రభుదేవాలతో పోలుస్తున్నారు. మంగీలాల్ కర్మకొద్దీ తాహశీల్దార్ అయిపోయారు కానీ, అదృష్ట ముంటేనా ప్రభుదేవా రేంజ్ కు చేరుపోయే వాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాను తాహశీల్దార్ అయితేనేంటీ, అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలని భావించిన మంగీలాల్ .. తన డ్యాన్స్ ప్రదర్శనలతో కొంత మందిలో ప్రేరణగా నిలుస్తున్నారు. టాలెంట్ కు వృత్తి, వయసు అడ్డుకాదని నిరూపిస్తున్న మంగీలాల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.