సముద్రం అంటే ఇష్టపడనివారు ఎవరు ఉంటారు చెప్పండి. ఇసుక తీరంలో, ప్రతీసారి ఒడ్డును తాకుతూ వెనక్కు వెళుతూ.. చూసే వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంటాయి. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ ఆ అలలతో ఆటలు ఆడటానికి ఇష్టపడుతుంటారు. అలలు ఎలాంటి అలుపు లేకుండా తీరాన్ని తాకి వెనక్కు వెళుతుంటాయి. అందుకే పెద్దలు జీవితాన్ని అలలో పోలూస్తూ ఎన్ని కష్టనష్టాలు వచ్చినా అలసిపోకుండా మనం ప్రయత్నాలను కొనసాగించాలంటారు. అయితే, సముద్రంలో అలలు ఆగిపోవటం అన్నది అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అత్యంత అరుదైన ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఓ సముద్ర తీరంలో అలలు ఎగసిపడకుండా నిలకడగా ఉండిపోయాయి. ఆ దృశ్యాన్ని చూస్తున్న జనం భయపడిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం కేరళలోని ఓ సముద్రంలోని బీచ్‌కు మత్స్యకారులతో పాటు మరికొంత మంది జనం వచ్చారు. అయితే అక్కడి దృశ్యాన్ని చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు.
సముద్రంలోని అలలుఎగసిపడకుండా నిశ్చలంగా ఉన్నాయి. అలా దాదాపు గంట పాటు అలలు నిలిచిపోయాయి. దీంతో జనం ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం నైనాంవలపు బీచ్‌లోనూ ఓ వింత సంఘటన జరిగింది. సముద్రం నీరు ఒడ్డునుంచి ఓ 50 మీటర్లు వెనక్కు వెళ్లిపోయింది. ఇక, ఈ రెండు ఘటనలను దృష్టిలో పెట్టుకుని జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ రెండు జరగబోయే ప్రమాదానికి సంకేతమనుకుని అల్లాడుతున్నారు. ప్రస్తుతం సముద్రంలో అలలు ఆగిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో ఎడిటెడ్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.