పెళ్లంటే తాళాలు, తలంబ్రాలు, మూడు ముళ్ళు, ఏడ అడుగులు ఇవే గుర్తుకు వచ్చేవి ఒకప్పుడు. కానీ.., ఇప్పుడు ట్రెండ్ మారింది కదా? పెళ్లి అంటే ఫోటోలు, వీడియోలు కంపల్సరీ అయిపోయింది. తాజాగా కర్ణాటకలో కూడా ఇలానే ఓ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కానీ.., పెళ్లి తరువాత జరిగిన ఫోటో షూట్ లో మాత్రం ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
భారతదేశ 11వ ప్రధానిగా పని చేసిన హెచ్.డి.దేవెగౌడ కుటుంబానికి కర్ణాటకలో ఎంతటి ప్రజాధారణ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కుమారుడు కుమారస్వామి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొంత కాలం పని చేశారు. కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ హీరోగా, రాజకీయనాయకుడిగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. మరి.. ఇంతటి బ్యాగ్రౌండ్ ఉన్న నిఖిల్ కుమార్ ఓ పెళ్ళికి గెస్ట్ గా హాజరైతే..! అక్కడ హంగామా మాములుగా ఉంటుందా?
తన కుటుంబం తరుఫున నిఖిల్ గౌడ తాజాగా ఓ పెళ్ళికి హాజరయ్యారు. అక్కడ పెళ్లి పెద్దలు నిఖిల్ కు మెడలో దండ వేసి, సకల మర్యాదలు చేసి, మండపంపైకి తీసుకెళ్లారు. పెళ్లి జంటతో ఫోటో దిగడానికి నిఖిల్ సిద్ధమవుతుండగా.. అంతలోనే కొంతమంది మండపంపైకి వచ్చేశారు. అలా.. అంతా అడ్జెస్ట్ అవుతూ, అవుతూ.. చివరికి పెళ్లికొడుకుని పక్కకి నెట్టేశారు. ఫోటో తీసే సమయానికి.. మెడలో దండతో హీరో నిఖిల్ కుమార్.. పెళ్లికూతురు పక్కన దర్జాగా నిలబడి ఉండగా, అసలు పెళ్లి కొడుకు మాత్రం ఓ మూలకి వెళ్లిపోయాడు. దీంతో.., ఇక్కడ అసలు పెళ్లి కొడుకు ఎవర్రా బాబు.. పెళ్లి కొడుకునే పక్కకి నెట్టేశారు అంటూ.. నెటిజన్స్ ఈ పిక్ ను తెగ వైరల్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.