కాజల్ అగర్వాల్ అంటే తెలుగు సినీ అభిమానులకు, ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కాజల్ ప్రస్తుతం గర్భవతి అయినా కూడా అభిమానులకు మాత్రం ఏమాత్రం దూరం కాలేదు. తన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా కాజల్ తన అభిమానులతో పంచుకుంటుంది. అలాగే తను ప్రెగ్నెంట్ అయ్యాక సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటోంది.
ఇటీవల ఓ చాక్లెట్ యాడ్ లో నటించి అందరినీ అవాక్ అయ్యేలా చేసింది కాజల్. తాజాగా బేబీ బంప్ తో వర్కౌట్స్ చేస్తున్న వీడియో తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కాసేపటికే దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాజల్ వీడియోకి హీరోయిన్లు కూడా ఫిదా అయిపోయారు. కొందరైతే ఎంతో మందికి నువ్వు ఆదర్శం అంటూ కామెంట్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ వర్కౌట్స్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.