సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఎలా ఫేమస్ అవుతారో తెలియకుండా పోయింది. సామాన్యులను కూడా ఓవర్ నైట్ లో సెలబ్రిటీలను చేస్తుంది సోషల్ మీడియా. ఇలా రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్న వ్యక్తి బెంగాల్ కు చెందిన చిరు వ్యాపారి భూబన్ బద్యాకర్. వీధుల్లో తిరుగుతూ వేరు శనక్కాయలు అమ్ముకునే బద్యాకర్.. తన వ్యాపారం పెంచుకోవడం కోసం అల్లిన ‘కచ్చా బాదం’ పాట ఎంత వైరలయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలోఎక్కడ చూసినా ఈ పాటే. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఈ పాటపై రీల్స్, డాన్స్ వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. జనాలని ఓ ఊపు ఊపిన ఈ పాటను తెలుగులోకి అనువదించారు. తెలుగులో కూడా ఈ లిరిక్స్.. అంతే క్రేజీగా ఉంటడంతో.. ప్రస్తుతం ఇది కూడా తెగ వైరలవుతోంది. ‘కచ్చా బాదం’ తెలుగు లిరిక్స్ మీకోసం..
పల్లి పలి.. ఇది పచ్చి పల్లి
పల్లి పల్లి ఇది పచ్చి పల్లి
కాల్చిన, వేపిన పల్లి కాదు పచ్చి పల్లి
పాత సామన్లయినా ఇస్తా.. పగిలిన మొబైల్‌కయినా ఇస్తాను.. తాజా పచ్చి పల్లి
రోల్డుగోల్డు సీనులు గట్రా గాదేల్లోని ధాన్యంకిస్తాను తాజా పచ్చి పల్లి
పల్లి పల్లి ఇది పచ్చి పల్లి
కాల్చిన, వేపిన పల్లి కాదిది పచ్చి పల్లి
పల్లివాలా వచ్చాడు చూడరో.. గల్లిగల్లి తిరుగుతున్నాడు చూడరో
మళ్లి మళ్లి రాని అవకాశం ఇదిరో.. తప్పకుండా పల్లి కొనాలి కదరో
బొండా, బజ్జి, గారె, చట్నీ, ఇడ్లీ సాంబారు ఎన్నున్నా గానీ.. అవి అన్ని వేస్టు
బాదం, పిస్తా, అల్లం, బెల్లం, పాలు, పెరుగు ఏవైనా కానీ.. తాజా పల్లి బెస్టు
పల్లి పల్లి ఇది పచ్చి పల్లి
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.