Viral Video: లాన్ తుఫాను అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే 20కిపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. ఇక, మీడియా తుఫానుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తోంది. తుఫాను అప్డేట్లను లైవ్‌లోకి వెళ్లిమరీ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. తుఫాను అప్డేట్లను అందిస్తున్న ఓ లేడీ జర్నలిస్ట్ మైకుకు కండోమ్ పెట్టి రిపోర్టింగ్ చేయటం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫోరిడాకు చెందిన కైలా గేలర్ ఎన్బీసీ న్యూస్ ఛానల్లో రిపోర్డర్గా పనిచేస్తోంది.
తాజాగా, లాన్ తుఫాను అప్డేట్లు ఇవ్వటానికి ఆమె ఫ్లోరిడాలోని తుఫాను ప్రభావిత ప్రాంతానికి వెళ్లింది. అక్కడ మైకుకు కండోమ్ పెట్టి రిపోర్టింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఎందుకు అలా మైకుకు కండోమ్ పెట్టి రిపోర్టింగ్ చేసిందో అర్థం కాక నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. మరి కొంతమంది ఎందుకలా చేశావంటూ.. మైకుకు ఉన్నది ఏంటంటూ నేరుగా ఆమెనే ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సదరు లేడీ జర్నలిస్ట్ కైలా గేలర్ స్పందించింది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో..
‘‘ చాలా మంది మైకుకు ఉన్నది ఏంటని నన్ను సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నారు. మీరు ఊహిస్తున్నది నిజమే.. అది కండోమ్. అక్కడ భీభత్సంగా వర్షం పడుతోంది. నీళ్లు గనుక మైక్‌లోకి పోతే మైక్ పాడవుతుంది. నాకు రిపోర్టింగ్ చేయటానికి ఆస్కారం ఉండదు. అందుకని అలా చేయాల్సి వచ్చింది. అది నిజంగా కండోమే’’ అంటూ సమాధానం ఇచ్చింది. ఇక, కైలా తెలివికి నెటిజన్లు మురిసిపోతున్నారు. నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ మైక్‌తో ఎలా పని చేయించుకోవాలో ఆమెకు తెలుసు’’.. ‘‘తెలివి ఎవరి సొత్తు కాదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Florida reporter explains why she put a “condom” on her microphone during her live broadcast of Hurricane Ian 👀🤔
pic.twitter.com/kbsMaaAHHW— Daily Loud (@DailyLoud) September 29, 2022