కళకు, కళాకారులకు భాషాబేధం లేదు.. స్పందించే హృదయం ఉంటే చాలు.. ఈ విషయం అనేక విషయాల్లో రుజువు అవుతూనే ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘కచ్చా బాదం’ సాంగ్ వినిపిస్తుంది. ఈ సాంగ్‌కు నెటిజన్లు, సెలబ్రిటీలు, పిల్లలు, పెద్దలు సైతం డ్యాన్స్‌లు చేస్తూ సోషల్ మీడియా లో పోస్టులు చేస్తున్నారు. సెలబ్రిటీలు వాహనాల్లో వెళ్తూ రోడ్డు పక్కన వాహనం నిలిపివేసి ఈ పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ కచ్చాబాదం అని పాట పాడి అనూహ్యంగా స్టార్ అయ్యడు భుబన్ బద్యాకర్.
ఈ తరహా పాటలు తర్వాత ఎన్నో వచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ఓ వ్యాపారి తన వద్ద ఉన్న ద్రాక్ష, జామపండ్లను అమ్ముతూ జింగిల్‌ని పాడి ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఈ వృద్ధుడు పాడిన జింగిల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ఆ వృద్దుడి వివరాలు మాత్రం ఎక్కడా తెలియరాలేదు. ద్రాక్షా, జామ రేట్ల గురించి పాటపాడుతూ ఉండటం చాలా ఫన్నీగా అనిపిస్తుంది. సాలిమినాయత్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ పాటలను పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను రెండున్నర లక్షలమంది వీక్షించారు.